English | Telugu
'స్ట్రయిట్‌గా చూస్తే శాంతిస్వరూప్‌లా ఉంటావ్'.. వర్ష పరువు తీసిన భాస్కర్!
Updated : Jul 26, 2022
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలోఎప్పుడూ కూడా స్కిట్ పండాలంటే కొన్ని జోక్స్ వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటూ ఆ షోకి రేటింగ్ పెంచే పనులు చేస్తూ ఉంటారు కమెడియన్స్. కొన్ని స్క్రిప్టెడ్ ఐతే కొన్ని స్పాంటేనియస్ గా జోక్స్ వేసేస్తూ ఉంటారు. అలాంటి ఒక జోక్ ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్ లో మనం చూడొచ్చు. వర్ష మీద బులెట్ భాస్కర్ వేసిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాబోయే ఎపిసోడ్ లో ఈ జోక్ మనకు వినిపిస్తుంది.
"అసలు వర్ష అమ్మాయేనా? మగాడిలా ఉంది" అంటూ భాస్కర్ చేసిన కామెంట్స్ కి వర్ష స్టేజి మీద ఒక్కసారిగా షాక్ ఐపోయింది. "వర్ష అమ్మాయే కాదు, పక్కన ఉంటే అబ్బాయితో ఉన్న ఫీలింగ్ వస్తుంది" అంటూ గతంలో ఒక స్కిట్ లో ఇమ్ము కూడా అన్నాడు. అప్పుడు వర్ష చాలా హర్ట్ అయ్యింది. వెంటనే స్టేజి మీదే సీరియస్ ఐపోయి స్కిట్ మధ్యలోంచి వెళ్ళిపోయింది.
మళ్ళీ అదే డైలాగ్ ఇప్పుడు బులెట్ భాస్కర్ నోటి నుంచి వచ్చింది. కానీ వర్ష మాత్రం ఆ హఠాత్పరిణామానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక నవ్వేసింది. అప్పుడు ఇమ్ము సారీ కూడా చెప్పాడు. కానీ భాస్కర్ మాటలకు ఇప్పుడు వర్ష బాధపడినట్లే కనిపించడం లేదు. వర్ష, బులెట్ భాస్కర్ ఇద్దరూ కలిసి లవర్స్ లా "తెల్ల తెల్లని చీర" పాటకు రొమాంటిక్ డాన్స్ చేశారు. తర్వాత వర్ష "నేను యాంకర్ ని.. యాంకర్ ని అని అందరికీ చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదేంటి?" అంది.
"నిన్ను అమ్మాయంటేనే ఎవరూ నమ్మట్లేదు.. ఇంక యాంకర్ అంటే ఎందుకు నమ్ముతారు?" అని వర్ష పరువు తీసేసాడు భాస్కర్. "నువ్ అలా అంటావ్ కానీ.. నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాననుకో లెఫ్ట్ నుంచి ఇంద్రజ గారు, రైట్ నుంచి ఖుష్భూ గారు అంటారు నన్ను" అంది వర్ష వయ్యారాలు పోతూ. "ఐతే స్ట్రైట్ గా చూస్తే శాంతి స్వరూప్ అంటారు" అని ఫుల్లుగా రెచ్చిపోయి పంచ్ వేశాడు భాస్కర్. వర్ష మూతి ముడుచుకుని ఏమి అనలేకపోయింది. ఇలా ఈ వారం బులెట్ భాస్కర్ పంచెస్‌కి వర్ష బలైనట్టు కనిపిస్తోంది.