English | Telugu

'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...

యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'పెళ్లి సందడి' చిత్రాన్ని టీవీల్లో వీక్షించేందుకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. వరుస టెలివిజన్ ప్రీమియర్స్ తో దూసుకెళ్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు', ఇప్పుడు 'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మీ ఎదురుచూపుకి ముగింపు పలకనుంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, రఘు బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 17న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.