English | Telugu

మ‌ళ్లీ వ‌స్తోన్న 'తల్లా పెళ్లామా'.. అనసూయ స్థానంలో శ్రీముఖి?

జెమినీ టీవీలో గతంలో ప్రసారమైన 'తల్లా పెళ్ళామా' రియాలిటీ షో కరోనా కారణంగా ఆగిపోయింది. ఐతే ఇప్పుడు మళ్ళీ ఈ షోని తిరిగి ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ ఛానల్. జులై 31 నుంచి ఈ సీరియల్ ఎపిసోడ్స్ ని తిరిగి ప్రసారం చేయబోతోంది. ఇప్పుడు ఈ రియాలిటీ షో ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ రవి అతని వైఫ్, వాళ్ళ అమ్మ పార్టిసిపేట్ చేసిన ప్రోమో ఇప్పుడు ప్రసారమవుతోంది.

ఐతే ఈ ఫామిలీతో స్టార్ట్ చేసిన ఎపిసోడ్ కాబట్టి మళ్ళీ ఆడియన్స్ లో ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసింది జెమినీ టీవీ. భార్యకు, తల్లికి కొన్ని టాస్కులు ఈ షోలో ఇస్తారు. ఎవరు పోటీ పడి ఆడగలరు అనే విషయంపై పిల్లలు తల్లికి ఓటేస్తారా.. పెళ్ళానికి ఓటేస్తారా? అంటూ సాగే ఒక ఈ 'తల్లా.. పెళ్ళామా' ..రియాలిటీ షోకి అప్పట్లో కొంతమంది సినీ, టీవీలో ఫేమస్ యాక్టర్స్ వాళ్ళ అమ్మలతో, భార్యలతో కలిసి పార్టిసిపేట్ చేశారు.

ఇక ఈ రియాలిటీ షో ఈ నెల జులై 31 ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్స్ కి హోస్ట్ గా గతంలో అనసూయ చేసింది. ఐతే ఇప్పుడు అనసూయ మిగతా షోస్ లో, మూవీస్ లో బాగా బిజీగా ఉన్న కారణంగా ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐతే ఇద్దరిలో ఎవరు వస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి వుంది.