English | Telugu
ఏమో అనుకున్నాం కానీ..సుమ మామూల్ది కాదు
Updated : Aug 2, 2022
సుమ కనకాల..ఈమె పేరులోనే ఒక బోల్డ్ నెస్ ఉంటుంది..ఒక అల్లరి పిల్ల ఉంటుంది..ఫుల్ టాలెంట్ ఉంటుంది. అందుకే ఏ హీరోయిన్ కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సుమకి ఉంటుంది. సుమ యాంకర్ మాత్రమే కాదు. యాక్టర్, సింగర్ కూడా. ఎలాంటి షోకైనా సుమ హోస్ట్ గా చేయాల్సిందే. సుమ డేట్స్ అవైలబిలిటీ చూసుకునే పెద్ద పెద్ద హీరోస్ కూడా తమ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే సుమ మల్టీ టాస్కింగ్ కాబట్టి. సుమ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. రకరకాల వీడియోస్ చేస్తూ నెటిజన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఒక్కోసారి తాను పెంచుకునే పెట్స్ కి బిస్కట్స్ వేస్తూ, వాటికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు, అలాగే తన స్టాఫ్ కి డాన్స్ నేర్పిస్తూ, ఒక్కోసారి తానే స్టెప్స్ వేస్తూ చేసే వీడియోస్ కి ఫుల్ కామెంట్స్ వస్తుంటాయి.
ఇక ఇప్పుడు సుమ వీణ వాయిస్తున్న ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇందులో సుమ అద్భుతంగా వీణ వాయించింది. "దాదాపు 20 ఏళ్ల తర్వాత వీణ వాయించాను.. మన మెదడు ఎంతో బలమైనది..ఎప్పటి జ్ఞాపకాలనైనా మోస్తూ, గుర్తు చేస్తూ ఉంటుంది. నా వీణా గురువు రమాదేవి గారిని మళ్ళీ గుర్తుచేసుకున్నాను" అంటూ కాప్షన్ పెట్టింది. సుమ చిన్నప్పుడే వీణ నేర్చుకుంది. ఇక నెటిజన్స్ ఐతే సుమ వీణ వాయించిన వీడియోకి సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐతే వీణ నేర్చుకున్న సుమ అప్పుడప్పుడు గొంతు కూడా సవరించుకుని బేస్ వాయిస్ లో పాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక ఈవెంట్ లో ఇలా అనుకోకుండా పాట పాడిన సుమతో థమన్ విన్నర్ మూవీలో "సుయ సుయ సుయ అనసూయ" అనే పాటను సుమతో పాడించేసారు. అలా సుమ ఆదిత్య ఆడియోలో పేరు నమోదు చేసుకుంది. ఇలా సుమ అంటే ఆల్ రౌండర్ అని నిరూపించుకుంది.