English | Telugu

మా ఆయనతో నాకు ఇంట్లో ప్రతీరోజూ జాతరే అన్న హారిక

బుల్లితెర మీద రకరకాల షోస్ ఆడియన్స్ ని అస్సలు ఖాళీ లేకుండా ఎంటర్టైన్ చేసేస్తున్నాయి. అసలే పండగల సీజన్. పండగలను, స్పెషల్ డేస్ ని టార్గెట్ చేస్తూ వాటి నేపథ్యంలో చాలా కామెడీ షోస్ ని రూపొందిస్తున్నారు యాజమాన్యాలు. ఐతే ఇప్పుడు జీ తెలుగులో బోనాల జాతర స్పెషల్ ఈవెంట్ ఫుల్ మస్తీ చేసింది. ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేసేసింది. ఇక ఈ షోకి జీ తెలుగు, స్టార్ మా సీరియల్ యాక్టర్స్ ఎంటర్టైన్ చేయడానికి విచ్చేసారు. అలా ఈ షోకి గెస్టులుగా వచ్చిన అందరినీ జాతర అంటే ఏమిటి అంటూ అడుగుతుంది శ్రీముఖి. యాక్టర్ హరితని ఇదే ప్రశ్న వేస్తుంది శ్రీముఖి. జీ తెలుగుకు వచ్చినప్పుడల్లా జాతరలానే ఉంటుందని తెలివిగా సమాధానం ఇస్తుంది హరిత. తర్వాత చెల్లెలి కాపురం యాక్టర్ పౌర్ణమి అలియాస్ హారిక వచ్చేసరికి సేమ్ క్వశ్చన్ వేస్తుంది శ్రీముఖి. హారిక తన భర్తతో కలిసి ఈ షోకి వచ్చింది. అసలు జాతర అంటే ఏమిటి ? నీకు ఏం గుర్తుకొస్తుంది అని శ్రీముఖి అడుగుతుంది. దీంతో హారిక "నాకు ఇంట్లో ప్రతీ రోజూ జాతరే" అంటూ సిగ్గుపడుతూ చెప్పేసరికి శ్రీముఖి ముఖం కూడా ఒక్కసారిగా మారిపోతుంది.

హారిక ఇచ్చిన ఆన్సర్ కి శృతి, శివజ్యోతి, హరిత,మధుప్రియ అందరూ పగలబడి నవ్వేస్తారు. తర్వాత శృతిని కూడా జాతర అంటే ఏమిటి మీ వెనక ఎంత మంది పడేవారు అప్పట్లో అని అడిగేసరికి ..లెక్కుంటే చెప్పొచ్చు కానీ అన్ లిమిటెడ్, మైండ్ బ్లోయింగ్ అని ఆన్సర్ ఇచ్చేసరికి శ్రీముఖి నోరెళ్లబెడుతుంది. హారిక 17 ఏళ్లకే బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చి పసుపు కుంకుమ, మేఘమాల, వరూధిని పరిచయం, శ్రావణ సమీరాలు, రుతుగీతం, నేను శైలజ వంటి సీరియల్స్ లో నటించింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.