English | Telugu

నూకరాజు, ఆసియా పెళ్లి జరిపించేసిన సుమ!

క్యాష్ షో ఎప్పుడూ సూపర్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు వస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు క్యాష్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు అలా హాయిగా నవ్వులతో సాగిపోయే ఈ షో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి పెళ్లిళ్లు చేసే స్టేజిలా మారిపోయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి బుల్లితెర షోస్ లో నటించే కమెడియన్ పెయిర్స్ ని తీసుకొచ్చింది సుమ. కార్తిక్‌-ష‌బీనా, నూకరాజు-ఆసియా, ప్రవీణ్-ఫైమా, పరదేశి-భాను.. ఇలా నాలుగు జంటలను తీసుకొచ్చింది. ఐతే ఆసియా-నూకరాజు, ఫైమా-ప్రవీణ్ ఈ రెండు జంటలు నిజమైన ప్రేమ జంటలన్న విషయం సోషల్ మీడియా మొత్తానికి తెలుసు. నూకరాజు ప్రేమ నిజమైనదా, కాదా? అని టెస్ట్ చేయడానికి సుమ ఒక టాస్క్ ఇచ్చింది.

"నీది నిజమైన ప్రేమైతే ఈ కర్పూరాన్ని చేతిలో పెట్టుకుని వెలిగించుకో" అంటూ వెలిగించింది. అది చూసి ఆసియా బాగా ఏడుస్తూ కర్పూరాన్ని పడేయమని నూకరాజుతో చెప్పింది. సుమ చేసిన ఆ పనికి అక్కడి వాళ్లంతా షాక్ ఐపోయారు. ఇలా చేతిలో కర్పూరాన్ని వెలిగించుకుని సాహసం పూర్తయ్యాక "మా అందరి సాక్షిగా ఆసియాకి తాళి కట్టు" అంటూ ఒక చైన్ నూకరాజు చేతికి ఇచ్చింది సుమ‌.

వెంటనే నూకరాజు కూడా ఏమీ ఆలోచించకుండా ఇదే అవకాశం అనుకున్నాడేమో వెంటనే క్యాష్ షో వేదికపై ఆసియా మేడలో కట్టేశాడు. నూకరాజు అలా చేసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ ఐపోయారు. నూకరాజు పెళ్లితో ఇప్పుడు క్యాష్ స్టేజి మీద పెళ్లిళ్లు కూడా జరిగిపోతున్నాయి. సుమ కూడా ఆ పరిణామానికి అవాక్కయి అలా చూస్తుండిపోయింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.