English | Telugu
అమ్మ బొమ్మాళి అంటూ శృతిక వెంటపడిన అనంత శ్రీరామ్
Updated : Aug 1, 2022
జీ తెలుగు ఛానెల్ లో సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ షో ఫుల్ ఫేమస్. ఇక ఈ వారం ఈ షో సెమి ఫినాలే రౌండ్ ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఫస్ట్ కంటెస్టెంట్ గా శృతిక ఎంట్రీ ఇచ్చేసింది. అరుంధతి మూవీలోంచి "భూ భూ భుజంగం" అనే పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పాటను పడడానికి ఎవరూ సాహసించరు. ధైర్యం, స్తైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లే ఈ పాటను ఎంచుకుంటారు అంటూ అనంత శ్రీరామ్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక ఈ పాటను కోటి గారు స్వరపరిచారు. ఈ పాట వినేసరికి కోటి గారు లేచి వచ్చి శృతికను ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని ఆశీర్వాదం అందించారు. శైలజ గారు, స్మిత ఇద్దరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. స్టేజి మీదకు శృతిక పేరెంట్స్ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు.
శృతిక పుట్టినప్పుడు మళ్ళీ ఆడపిల్లేనా అన్నవాళ్లకు ఇదే రిజల్ట్ అంటూ శృతికను చూపించారు వాళ్ళ అమ్మ. అబ్బాయి పుడితే ఇంత హ్యాపీగా ఉండేదాన్నో లేదో కానీ నా కూతుళ్లిద్దరూ నన్ను ఎప్పుడూ తలెత్తుకునేలా చేస్తూనే ఉంటారు అంటూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ని శృతికకు అందిస్తారు. తర్వాత కోటి గాను గోల్డెన్ టికెట్ ఇచ్చేసి గోల్డెన్ సోఫాలో కూర్చోబెడతారు. ఐతే శ్రీముఖి అదే టైంలో ఒక సూపర్ టాస్క్ ఇస్తుంది. సోనూసూద్ గా అనంత శ్రీరామ్ వచ్చి శృతిక అనుష్కగా చేయాలనేసరికి శృతిక అనుష్కల డాన్స్ వేస్తుంది. సోనూసూద్ లా అనంత శ్రీరామ్ అమ్మ బొమ్మాళి అంటూ గట్టిగా అరిచి మరీ స్కిట్ పెర్ఫామ్ చేస్తారు.