English | Telugu
'నువ్వంటే పిచ్చి.. పిచ్చి నా కొడకా'.. సాకేత్‌తో 'నేనింతే' హీరోయిన్!
Updated : Aug 1, 2022
'జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్' ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ వారం ఎపిసోడ్ అంతా పోటాపోటీగా సాగింది. కంటెస్టెంట్ అఖిల్ వచ్చి "ప్రియా ప్రియా చంపొద్దే" అనే సాంగ్ ఫుల్ జోష్ తో పాడేశాడు. అదే టైంలో 'నేనింతే' మూవీలో రవితేజకి జోడీగా నటించిన అదితి (సియా గౌతమ్) ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అఖిల్ పాడిన ఈ సాంగ్ కి ఫుల్ ఫిదా ఐపోయింది అదితి. ఇంకా ఈ సాంగ్ లో ఒక చరణాన్ని మళ్ళీ లాస్ట్ లో పాడించుకుని స్టేజి మీదకు వెళ్లి అఖిల్ తో కలిసి స్టెప్పేసింది. అంతలో శ్రీముఖి వచ్చి 'నేనింతే'మూవీలో రవితేజని తిట్టే డైలాగ్ చెప్పమని అడిగింది. వెంటనే "రవితేజగా ఎవరు వస్తారు"... అని చూస్తూ "సాకేత్ నీ చూపులు అందరినీ గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి నువ్వే రవితేజ క్యారెక్టర్ లో రావాలి" అనేసరికి సాకేత్ షాకైపోయాడు.
ఇక రవితేజగా స్టేజి మీదకు వచ్చేసి అదితితో డైలాగ్ చెప్తాడు "నీ పిచ్చేంటే.." అని అదితిని అడిగేసరికి "పిచ్చి ఏంటే పిచ్చి అని అడగొద్దురా.. నువ్వే రా నా పిచ్చి, పిచ్చి నా కొడకా" అంటూ సాకేత్‌ని తిట్టేసింది అదితి గౌతమ్. "డైలాగ్ స్టార్టింగ్ నుంచి బ్రోకెన్ తెలుగులో మాట్లాడి లాస్ట్ లైన్ డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్ తెలుగులో మాట్లాడారు" అన్నాడు సాకేత్.
తర్వాత చరణ్ ని చూపించి 'హ్యాండ్సమ్ కదా అందుకే మా ఇద్దరి మధ్య లవ్ ఉంద'ని చెప్తుంది శ్రీముఖి. "హే డ్యూడ్ ఆర్ యు ఆల్సో మారీడ్" అని చరణ్ ని అదితి అడిగింది. 'లేదు' అన్నట్టుగా చేతులెత్తేసి దణ్ణం పెట్టాడు చరణ్. "అందరినీ పెళ్లయిందా లేదా అని అడగాల్సి వస్తోంది" అని అదితి అనేసరికి "ఛ ఇంకా లేదు, అతను లేత పండు" అంది శ్రీముఖి. తర్వాత ఆమె, చరణ్ గత ఎపిసోడ్స్ నుంచి ట్రోల్ అవుతున్న లవ్ ఫొటోస్ చూపించింది.