English | Telugu
పల్లకిలో జబర్దస్త్ కొత్త యాంకర్ కు గ్రాండ్ వెల్కమ్!
Updated : Aug 1, 2022
ఖతర్నాక్ కామెడీ షో `జబర్దస్త్`. గత కొంత కాలంగా కంటెస్టెంట్ లు, టీమ్ లీడర్ల స్కిట్ లతో నవ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. జూలై నెలలో చివరి ఎపిసోడ్ తో జబర్దస్త్ జర్నీకి వీడుకోలు పలికింది అనసూయ. తనతో పాటు మనో కూడా ఈ షో నుంచి తప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ సింగర్ జూనియర్ లో కనిపిస్తున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్తగా హీరోయిన్ సంగీత ఎంట్రీ ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది.
ఇక ఈ షో నుంచి అనసూయ కూడా వెళ్లిపోవడంతో ఆ స్థాయిలో గ్లామర్ ని ఒలికించేది ఎవరు? .. తన స్థానంలో కొత్త యాంకర్ గా మల్లెమాల టీమ్ ఎవరిని దించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆగస్టు 4న గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో కొత్తగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చే యాంకర్ ని టీమ్ మెంబర్స్ అంతా తీన్మార్ డాన్సులు చేస్తూ పల్లకీలో ఊరేగింపుగా తీసుకురావడం కనిపిస్తోంది.
అయితే పల్లకిలో భారీ బల్డప్ తో వస్తున్న యాంకర్ రష్మీనే అని కొంత మంది అంటుంటే కాదు యాంకర్ మంజుషా అని మరి కొంత మంది అంటున్నారు. అయితే ఫైనల్ గా మాత్రం ఈ షోలోకి ఎంట్రీ ఇస్తోంది మంజుషనే అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ తాజా ఎపిసోడ్ లో `కార్తికేయ 2` టీమ్ సందడి చేసింది. ఆగస్టు 5న విడుదల కానున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకుడు. శ్రీనివాసరెడ్డి సపోర్టింగ్ పాత్రలో నటించాడు. నిఖిల్ తో కలిసి ఈ ఇద్దరు కూడా జబర్దస్త్ లో సందడి చేయడం విశేషం.