English | Telugu
'దేశోద్ధారకులారా.. ఇది నా జీవితం!'.. కౌంటర్ వేసిన ప్రగతి
Updated : Aug 2, 2022
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీస్ లో యాక్ట్ చేస్తుంది. టైమింగ్ ఉన్న కామెడీతో జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కూడా మెరుస్తోంది. ప్రగతి జిమ్ వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె చేసే వర్కౌట్స్ కి నెటిజన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తూ తన హెల్త్ ని కాపాడుకుంటది అనే టాక్ ఉంది.
ఐతే ఇటీవల ప్రగతి ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇందులో చిన్నపిల్లలా డ్రెస్ చేసుకుని 'సఖి' సినిమా సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోకి కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు నెగటివ్ గా మాట్లాడారు. ఇలాంటి కామెంట్స్ వస్తాయని ముందే ఊహించిన ప్రగతి "ఓ దేశోద్ధారకులారా.. నేను యంగ్ గా కనిపించడానికి ట్రై చేయడం లేదు.. నా జీవితాన్ని నేను జీవిస్తున్నా" అంటూ కాప్షన్ పెట్టేసింది.
"యంగ్ గా కనిపించడంలో తప్పులేదు, మీరు నేటి తరం ఆటీల కోసం ఒక ట్రెండ్ సెట్ చేశారు, బ్యూటిఫుల్" అంటూ కొందరు కామెంట్స్ చేశారు. "బతకాలి అంటే ఇలాంటి దుస్తులు వేసుకుని డాన్స్ చేయాలని చాలా మందికి తెలియదు. వాళ్లకు ఈ వీడియో చూపిస్తాను" అంటూ కూడా కొందరు కామెంట్స్ చేశారు. ఎవరేమనుకున్నా సోషల్ మీడియాలో ఎవరూ ఎక్కడా తగ్గట్లేదు. మా లైఫ్ మా ఇష్టం అంటున్నారు.
ఇక ప్రగతి.. బుల్లితెర మీద, వెండితెర మీద నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇటీవల 'ఎఫ్ 3' మూవీలో నటించి కామెడీ చేసి ఆడియన్స్ ని అలరించింది. అలాగే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో కూడా మెరిసింది. ఇలా అవకాశాలని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది ప్రగతి.