రవి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తుంది నవ్యస్వామి!
ఢీ - 14 డ్యాన్సింగ్ ఐకాన్ కలర్స్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఫస్ట్ టు రౌండ్స్ తో కిస్సి, మహాలష్మి విన్ అవుతారు. తరవాత నవస్వామి, రవికృష్ణ టీమ్ ఓడిపోయేసరికి వాళ్లకు ఒక టాస్క్ ఇస్తారు గణేష్ మాస్టర్. నవ్యస్వామి మిమిక్రీ ఆర్టిస్ట్ అని ప్రదీప్ చెప్పేసరికి బాలయ్య బాబులా డైలాగ్ చెప్పమని అడుగుతారు. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" అనే డైలాగ్ చెప్పి తొడ కొడుతుంది నవ్య. తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ డైలాగ్ చెప్పమని అడిగేసరికి "వయోలెన్స్ వయోలెన్స్ " అనే డైలాగ్ చెప్పేస్తుంది నవ్య.