English | Telugu

ఆర్పీ మీద కౌంటర్ ఎటాక్ తో జాతిరత్నాలు!

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయినా కిర్రాక్ ఆర్పీ చాలా రోజుల తర్వాత ఆ మల్లెమాల సంస్థ గురించి అక్కడి ప్రొడక్షన్ ఫుడ్ గురించి చేసిన కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొంతమంది ఆర్పీ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది మాత్రం ఆర్పీ కి కౌంటర్ ఎటాక్స్ కూడా ఇచ్చారు. ఇలా ఈ కాంట్రవర్సీ ఎలా గోలా కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. ఐతే ఇప్పుడు ఇదే థీమ్ తో జాతిరత్నాలు షోలో ఒక స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ లో పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమ్మానుయేల్, శ్రీముఖి పార్టిసిపేట్ చేశారు. ఈ నలుగురు రౌండ్ టేబుల్ లా కూర్చుని డిబేట్ కార్యక్రమం నడిపిస్తారు.

"మీకు ఆరోగ్యం బాగోనప్పుడు మీరు ఏదైతే సంస్థలో పని చేస్తున్నారో ఆ సంస్థ మీకు నిజంగానే అన్యాయం చేసిందా అంటూ ఇమ్మానుయేల్ ప్రసాద్ ని అడుగుతాడు" మీకనే కాదు అందరికీ ఈ విషయం గురించి చెప్పాలి అంటూ ప్రసాద్ తన ఎక్స్పీరియన్స్ ని చెప్పబోతాడు . ఐతే అతను మాట్లాడిన మాటల్ని కట్ చేసేస్తారు. తర్వాత నూకరాజు వచ్చి "మీరు చేసే సంస్థలో ఫుడ్ బాగోదని టాక్ నడుస్తోంది..దీని గురించి మీరేం చెప్తారు అని ప్రసాద్ ని అడుగుతాడు. ఇలా ఈ డిబేట్ చాలా ఘాటుగా జరిగినట్టు ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఆర్పీ మీద ఎలాంటి కౌంటర్లు వేశారు ? అనే విషయం తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. ఐతే మల్లెమాల ఇలా ఆర్పీకి మళ్ళీ గట్టిగా కౌంటర్లు ఇవ్వడానికి స్కిట్స్ వేయిస్తోందనే విషయం అర్థమౌతోంది. మరి ఆర్పీ ఈ స్కిట్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ? అసలు రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.