English | Telugu

లై డిటెక్టర్ పరీక్షలో పాసైన ఫైమా.. ప్రవీణ్ మీద ప్రేమను ఇలా చెప్పేసింది

ఇప్పుడు బుల్లి తెర మీద ప్రవీణ్ ఫైమా లవ్ స్టోరీ సెన్సేషన్ సృష్టిస్తోంది. వీళ్ళ ప్రేమ పటాస్ షో నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత్తర్వాత ఇద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఏ చిన్న సందర్భం దొరికినా ప్రవీణ్ ఫైమా మీద తన ప్రేమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఫైమా మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి ప్రవీణ్ ఐ లవ్ యూ అనే మాత్రం చెప్పలేదు. ప్రవీణ్ అంటే ఇష్టం ఉందో లేదో కూడా ఎప్పుడూ ఆడియన్స్ ముందు మాత్రం ఫైమా ఓపెన్ కాలేదు. ఐతే ఇప్పుడు తాజాగా క్యాష్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి నాలుగు జంటలు వచ్చి సందడి చేశాయి. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో వీళ్లంతా ఫుల్ మస్తీ చేయబోతున్నారు.

ఈ షోలో నూకరాజు, ఆసియా ప్రేమకు పరీక్షా పెట్టింది. తర్వాత సుమ ప్రవీణ్, ఫైమా జంటకు లై డిటెక్టర్ పరీక్షలు పెట్టింది. నీకు బెస్ట్ కమెడియన్ అవార్డు కావాలా ? ప్రవీణ్ కావాలా ? అని ఫైమని అడుగుతుంది సుమ. "నాకు అవార్డు వద్దు, ప్రవీణ్ కావాలి" అంటుంది ఫైమా. ఫైమా ఆన్సర్ రాంగ్ అన్నట్టుగా ఆ లై డిటెక్టర్ మూడుసార్లు కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉంటుంది. నువ్ ఎన్నిసార్లయినా అరుచుకో నాకు ప్రవీణే కావాలి అంటుంది ఫైమా. అలా క్యాష్ లో ప్రవీణ్ మీద ఉన్న తన ప్రేమను ఇన్నాళ్లకు ఈ షో ద్వారా బయటపెట్టింది. ఇలా ఈ షోకి వచ్చే వారం రేటింగ్ పెంచుకునే పనిలో పడింది సుమ. ఇప్పుడు ఈ షో ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.