Read more!

English | Telugu

రవి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తుంది నవ్యస్వామి!

ఢీ - 14 డ్యాన్సింగ్ ఐకాన్ కలర్స్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది.  ఫస్ట్ టు రౌండ్స్ తో కిస్సి, మహాలష్మి విన్ అవుతారు. తరవాత నవస్వామి, రవికృష్ణ టీమ్ ఓడిపోయేసరికి వాళ్లకు ఒక టాస్క్  ఇస్తారు గణేష్ మాస్టర్. నవ్యస్వామి మిమిక్రీ ఆర్టిస్ట్ అని ప్రదీప్ చెప్పేసరికి బాలయ్య బాబులా డైలాగ్ చెప్పమని అడుగుతారు. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" అనే డైలాగ్ చెప్పి తొడ కొడుతుంది నవ్య. తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ డైలాగ్ చెప్పమని అడిగేసరికి "వయోలెన్స్ వయోలెన్స్ " అనే డైలాగ్ చెప్పేస్తుంది నవ్య.

 నవ్య డైలాగ్ డెలివరీలో ఆది మిడిల్ లో వచ్చేసరికి అతన్ని కూడా స్టేజి మీదకు పిలిచి మోహన్ బాబు డైలాగ్ చెప్పమని అంటారు. "అరిస్తే చరుస్తా" అంటూ మంచి ఫోర్స్ లో డైలాగ్ చెప్పేస్తాడు ఆది. నవ్యస్వామి వెంటనే నీ ఫ్లూటు జింక ముందు ఊదు నా ముందు కాదు అంటుంది. జింక ముందు ఊదు అంది అంటే నవ్యస్వామి గాడిదా ఏమిటి అంటాడు. ఇలా తిట్టుకుంటున్నప్పుడు  కెమెరా ముందు ఆది, నవ్య టామ్ అండ్ జెర్రీ కెమెరా వెనక మంచి ఫ్రెండ్స్ అంటాడు రవికృష్ణ. 

సరే ఇప్పుడు నువ్వు మీ ఇద్దరిది ప్రేమ, పెళ్లా ఫ్రెండ్స్ ఇందులో ఏది నువ్వు వచ్చి స్టేజి మీద చెప్పు అనేసరికి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు రవి . మా ఇద్దరి మధ్య ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉంది అని రవి అంటే ఫ్రెండ్షిప్ అంటే లవ్ , ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అంటోంది నవ్య అని ఆది అంటాడు. నవ్య నా లైఫ్ లోకి వచ్చింది కాబట్టి తనకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. అతని లైఫ్ లోకి వెళ్ళావా మరి ఫ్రెండ్స్ అంటారేంటి అంటాడు ఆది. ఒక వేళా ఎప్పుడైనా రవి నీకు ప్రొపోజ్ చేస్తే నువ్వేం చెప్తావ్ అని నవ్య ని అడిగేసరికి నా పర్సనల్ విషయం అంటుంది. అర్దమయ్యిందిలే మీ పర్సనల్ ఎంతో అంటూ వెళ్ళిపోతాడు.