English | Telugu

'చెయ్యి చూశావా రఫ్‌గా ఉంది.. రఫ్ఫాడించేస్తా'.. సుధీర్‌కు చిత్ర వార్నింగ్‌

సూపర్ సింగర్ జూనియర్స్ షో రేటింగ్స్ లో దూసుకుపోతూ పాటలంటే ఇష్టపడే అభిమానుల్ని మస్త్ గా అలరిస్తోంది. ఇక రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో అనసూయ, సుధీర్ హోస్టింగ్ కి ఫాన్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఈ షోలో సుధీర్ వస్తూనే అనసూయతో కలిసి డాన్స్ చేసేసి తనలో తానె నవ్వేసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. "ఎందుకు నవ్వుతున్నావ్?" అని అనసూయ అడిగేసరికి "బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నట్టు కలొచ్చింది" అంటాడు.

సుధీర్ అవార్డు తీసుకోవడం మంచిదే కానీ ఆ అవార్డు ఇచ్చిన వాళ్ళే దురదృష్టవంతులు అంటుంది అనసూయ. ఆ దేవుడి దయ వల్ల ఆ అవార్డు ఇచ్చింది మీరే అని కౌంటర్ వేసేసరికి అనసూయ నవ్వేస్తుంది. ఈ ఎపిసోడ్ సూపర్ సింగర్స్ సెలెబ్రేషన్స్ విత్ సూపర్ సింగర్ స్టార్స్ గా మంచి మంచి పాటల ధమాకాని అందించబోతోంది. తర్వాత ప్లేబాక్ సింగర్స్ వచ్చి జూనియర్స్ తో కలిసి పాటలు పాడతారు. తర్వాత సుధీర్ ఒక కామెడీ బిట్ ని పండిస్తాడు.

హేమచంద్రకిసుధీర్ ఫోన్ చేసి హలో ఇక్కడో సమస్య వచ్చిందని అనేసరికి రిప్లై ఇవ్వకుండా "హలో హలో" అంటూ హేమచంద్ర ఆట పట్టిస్తూ ఉంటాడు. తర్వాత అనసూయ "కాల్ కలవకపోతే మెసేజ్ పెట్టు" అనేసరికి "లొకేషన్ పంపిస్తున్న రా మావా" అని టైపు చేసేలోపు హేమచంద్ర స్టేజి మీదకు వచ్చేస్తాడు. అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ ఐపోయి "లొకేషన్ ఇంకా పెట్టలేదుగా మావ అప్పుడే ఎలా వచ్చావ్?" అని సుధీర్ అడిగేసరికి "ఐతే లొకేషన్ పెట్టు వెనక్కి వెళ్లి మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోతాడు హేమచంద్ర.

ఇక హేమచంద్రను ఆట పట్టించిన సుధీర్ కి చిత్ర వార్నింగ్ ఇస్తారు. "చెయ్యి చూసావా రఫ్ గా ఉంది రఫ్ఫాడించేస్తా" అంటారు. ఆ తర్వాత హేమచంద్రని చూసి "నమస్కారం గురువుగారు" అని దణ్ణం పెట్టేసరికి హేమచంద్ర "అమ్మ బాబోయ్" అని పారిపోతాడు. ఫైనల్ గా చిత్రతో కలిసి హేమచంద్ర "లలిత ప్రియకమలం విరిసినది" అంటూ అద్భుతంగా పాడి అందరినీ మైమరిపిస్తాడు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.