English | Telugu

నీలో పౌరుషం లేదా ప్రవీణ్.. పరువు తీసిన సుమ!

క్యాష్ షోలో గత వారం జబర్దస్త్ ఫామిలీ నుంచి నాలుగు జంటలు వచ్చి కామెడీని పంచి వెళ్లాయి. ఈ షోలో నలుగురు అమ్మాయిలకు సుమ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. షబీనా వచ్చిన "అమ్మ నాకు త్వరగా పెళ్లి చేసేయి" అంటుంది సుమతో. "నీకోసం మంచి వరుడిని కూడా చూసా" అంటుంది సుమ. "మహేష్ బాబా, పవన్ కళ్యాణా?" అని షబీనా అడిగేసరికి "వాళ్లిద్దరూ కాదు వాళ్ళ పెదనాన్న" అంటూ పరదేశిని చూపిస్తుంది. "నీకు టాలెంట్ ఉన్నట్టయితే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే "దాయి దాయి దామ్మా" సాంగ్ స్టెప్ వేసి చూపించాలి" అంటూ టెస్ట్ పెడుతుంది. ఇక ఏదో రకంగా ఆ స్టెప్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసేస్తాడు. తర్వాత ఆసియా కోసం నూకరాజుని పెళ్లికొడుకుగా పిలుస్తుంది సుమ. ఇంతలో ఆసియాని నూకరాజు తిడతాడు.

"ఏంటి నా ముందే మా అమ్మాయిని తిడుతున్నావ్?" అని సీరియస్ అవుతుంది సుమ. "ఆ అమ్మాయిని పిలుస్తా, నిన్ను పిలుస్తా, ఆ అమ్మాయికి ముద్దు పెడతా.. నీకు.." అంటూ సుమ వైపు వేలు చూపించేసరికి ఒక్కసారి షాక్ ఐపోతుంది. వెంటనే సారీ చెప్తాడు నూకరాజు. ఇక సుమ కూడా "మూసుకుని వెళ్ళు సంబంధం లేదు, గాడిద గుడ్డు లేదు" అంటుంది. తర్వాత "నా కోసం ఎలాంటి అబ్బాయిని తెస్తున్నావ్ అమ్మ" అని ఫైమా అడిగేసరికి "ఒకడున్నాడే వస్తున్నాడు" అంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ లా ప్రవీణ్ వచ్చి సుమని మంచినీళ్లు ఇమ్మంటాడు. కుండతో నీళ్లు దోసిట్లో పోస్తే తాగి "క్యాష్ నీళ్లు తాగేసరికి నా కళ్ళల్లో పౌరుషం చూడమ్మా" అంటాడు. "ఐతే నీలో పౌరుషం లేదా?" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది సుమ. తర్వాత ప్రవీణ్ ని గుర్తుపట్టి "ఫైమా కోసం వచ్చింది నువ్వేనా. మంచి పని చేసావ్ మూడు జాకెట్లు తొడుక్కుని వచ్చావ్. లేదంటే వచ్చే ఈదురు గాలులకు ఎప్పుడో ఎగిరిపోయేవాడివి" అనేసరికి అందరూ నవ్వేస్తారు. ఫైనల్ గా భాను కోసం కార్తిక్ ని పిలుస్తుంది. కానీ "నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ వున్నాడు" అనేసరికి సుమ "ముందే చెప్పాలి కదా. సంబంధం చూసాక ఈ బిల్డప్ ఎందుకు?" అంటూ ఫైర్ అవుతుంది. ఇలా పెళ్లి సంబంధాలు చూసే పెద్దమనిషిగా మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది సుమ.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..