English | Telugu

శ్రీమతి శ్రీనివాస్ హీరో పై వేటు!

స్టార్ మా ఛానెల్ లో శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఇందులో ఇప్పుడు శ్రీనివాస్ గా చేస్తున్న చందన్ కుమార్ ని తప్పించి మరో కొత్త హీరోని తెర మీద ప్రవేశ పెట్టారు. శ్రీదేవి బాధగా ఉండగా శ్రీనివాస్ వచ్చి ఆమెను హగ్ చేసుకుంటాడు. అందులో అసలు శ్రీనివాస్ లేకపోయేసరికి ఆడియన్స్ అంతా నిరాశను వ్యక్తం చేసున్నారు. కొత్త హీరో బాలేదని, పాత హీరోనే కంటిన్యూ చేయాలంటూ వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఐతే చందన్ కుమార్ ఇటీవల షూటింగ్ టైంలో టీంతో జరిగిన వివాదం కారణంగా ఈ హీరో మార్పు అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై చందన్ కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వెళ్తూ వస్తూ షూటింగ్స్ చేయాలంటే టైం సరిపోవడం లేదన్నారు. ఇదే టైములో వాళ్ళ అమ్మకు ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ లో చేర్చినట్లు చెప్పారు. హాస్పిటల్ లో ఉంటూ సరైన నిద్ర లేక షూటింగ్ టైంలో కాస్త రెస్ట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అదే టైంలో షూటింగ్ టీమ్ నుంచి ఒక అసిస్టెంట్ వచ్చి పిలిచేసరికి ఒక ఐదు నిమిషాలు ఆగి వస్తానని చెప్పు అంటూ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా అలా సరదాగా తోసాను తప్ప అదేదో కావాలనో, కోపంతోనో కాదు అన్నాడు. అతనేమో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని డైరెక్టర్ వరకు వెళ్లి చెప్పేసరికి మొత్తం టీమ్ అంతా వచ్చి తన మీద దాడి చేసినట్లు చెప్పాడు. ఆ టైంలో నాకు ఎవరూ సపోర్ట్ గా కూడా లేరు. నేను ఒంటరినైపోయాను. నాకు తెలుగు భాష కూడా అంతగా రాదు.

అందుకే అసలు ఏం జరిగిందో అనే విషయాన్ని సరిగా వివరించి చెప్పలేకపోయాను అని అన్నారు. సీరియల్ మధ్యలో క్యారక్టర్ రీప్లేస్మెంట్ గురించి అడిగేసరికి తనకు కొంచెం విశ్రాంతి అవసరం అని ఇక ముందు శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో కనిపించను అని చెప్పారు చందన్ కుమార్ ". ఈ ఘటన తర్వాత టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చందన్ పై జీవితకాల నిషేధం విధించింది.


Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.