Read more!

English | Telugu

నా కామెడీ, స్టైల్ వెనక సీక్రెట్ ఇదే!

సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా టీవీ షోస్ తో పాటు సుధీర్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. రాఘవేంద్రరావు "వాంటెడ్ పండుగాడ్" మూవీలో నటించాడు. శ్రీధర్ పీసాన డైరెక్షన్ లో ఈ మూవీలో సుధీర్ కి  దీపికా పిల్లి జంటగా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో బాగా పాల్గొంటున్నారు సుధీర్ అండ్ టీమ్. 

ఈ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ కి ఒక ప్రశ్న ఎదురయ్యింది. కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ వెనక ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగేసరికి తానేమీ బై బర్త్ యాక్టర్ ని కాదు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా తాను ఎదుటి వాళ్ళ స్టయిల్ ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. 

ముఖ్యంగా బ్రహ్మానందంగారు, శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ ను మిక్స్ చేసి తానూ  కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటానని చెప్పాడు. ఇక తన స్టైల్ లో రజినీకాంత్ గారు, డ్యాన్స్ లో చిరంజీవి గారు, రియల్ లైఫ్ బిహేవియర్ లో పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతం సుధీర్ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాంటెడ్ పండుగాడ్ మూవీలో సునీల్, అనసూయ, విష్ణుప్రియ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.