English | Telugu

సంద‌డిగా పల్లవి సీమంతం వేడుక!


'పాపే మా జీవన జ్యోతి' సీరియల్ తో పల్లవి రామిశెట్టి ఫేమస్ అయ్యింది. ‘రంగుల కల’ అనే షో ద్వారా బుల్లితెర పైకి అడుగుపెట్టింది పల్లవి. ఈ షో సక్సెస్ అయ్యేసరికి మరిన్ని ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 'భార్యామణి', 'ఆడదే ఆధారం' సీరియల్స్ తో పల్లవి మరింతగా పాపులర్ అయ్యింది. 'భార్యామణి' సీరియల్ లో ఉత్తమ నటనకు గాను నంది అవార్డును కూడా గెలుచుకుంది పల్లవి. తర్వాత ‘మాటే మంత్రం’సీరియల్ లో వసుంధరగా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ప్రస్తుతం 'అత్తారింటికి దారేది', 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఈమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. అందుకే పల్లవికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ కూడా పెద్దగా తెలియవు. ఐతే ఇటీవల తన సీమంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా ఈ హడావుడిని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి పల్లవి గురించి తెలిసింది. ఇక బుల్లి తెర నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి కాబోతున్న పల్లవికి నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. పల్లవి 2019 మే 23న దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.