Read more!

English | Telugu

అనుకుంటాం కానీ అవి ఎప్పటికీ మనవి కావు.. అనసూయ ఎమోషనల్ పోస్ట్!


యాంకర్ అనసూయ ఇటీవల జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది. స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ షోకి హోస్ట్ గా సుధీర్ తో కలిసి చేస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా మంచి ఆఫర్స్ ని తెచ్చుకుంది అనసూయ. అటు మూవీస్ లో నటిస్తూ ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగిస్తోంది. ఐతే అనసూయ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. " కొన్నిసార్లు మీకు అలవాటైన ప్రదేశం.. మీకు చెందిన స్థలం మాత్రం కాదు.." అంటూ పోస్ట్ చేసి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 

ఇక నెటిజన్స్ కూడా అనసూయ కామెంట్ ని ఫుల్ ట్రోల్ చేసేస్తున్నారు. ఏ ప్లేసెస్ మనవి కావు టాయిలెట్సా అంటూ కామెంట్ చేశారు. ఇంకా కొంతమంది నెటిజన్స్ మాత్రం లవ్ యు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ రంగమ్మత్త మాత్రం కాస్త ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నా మంచి మంచి ఆఫర్స్ ని దక్కించుకుంటూ మంచి రెమ్యూనరేషన్స్ తెచ్చుకుంటూ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.