Read more!

English | Telugu

వంటలక్క వచ్చేస్తుందోచ్ ...ఆనందంలో అభిమానులు!

కార్తీక దీపం సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ ఫాన్స్ వున్నారు. ఈ సీరియల్ గురించి తెలియని వారే వుండరు. ఈ సీరియల్ కి వచ్చిన రేటింగ్ మరే సీరియల్ కి కూడా రాదు. వంటలక్క, డాక్టర్ బాబు ఈ సీరియల్ ద్వారా మస్త్ ఫేమస్ అయ్యారు. దీంతో వాళ్ళ అసలు పేర్లు కూడా మర్చిపోయారు ఆడియెన్సు. 

దాదాపుగా నాలుగేళ్ల పాటు సాగిన ఈ సీరియల్ ఇపుడు పిల్లలు పెద్దవాళ్ళైపోయి వాళ్ళతో సీరియల్ ని నడిపిస్తున్నారు. దీప చనిపోయినట్టుగా చూపించి సీరియల్ నుంచి తప్పించేసరికి ఆ సీరియల్ కి వున్న రేటింగ్ అమాంతం పడిపోయింది. ఇలాంటి తరుణంలోనే కార్తీకదీపం అభిమానులు గుడ్ న్యూస్ అంటూ తెలిపింది దీప. కార్తీక దీపం సీరియల్ లో తాను రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ స్టేటస్ లో పెట్టింది. 

"వస్తున్నా మీ కోసం" అంటూ మేకప్ చేసుకుంటున్నట్టుగా ఉన్న ఒక ప్రోమోని  పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన  ఆమె అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ వంటలక్క మీతో పాటు డాక్టర్ బాబును కూడా వెంట తీసుకురండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.