English | Telugu

నరేంద్రమోడీ గారిని కలవడం నిజంగా అదృష్టం...

పీవీ.సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మొదట్లో ఎన్నో విమర్శలు తట్టుకుని అంచలంచెలుగా పైకి ఎదిగి ఈరోజున ఎంతో మంది పేరెంట్స్ కి, పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడింది. అలాంటి పీవీ.సింధుని ఆలీ తన షోకి తీసుకొచ్చి ఎన్నో విషయాలను చెప్పేలా చేశారు. "నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు నీ ఫీలింగ్ ఏమిటి ? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ? ఐస్ క్రీం కూడా తిన్నావు కదా ? అది ఏ ఫ్లేవర్ ? అంటూ ఆలీ సరదాగా కొన్ని, ఇంటరెస్టింగ్ గా కొన్ని ప్రశ్నలు అడిగేసరికి అన్ని ఫ్లేవర్స్ తెప్పించి నా ముందు పెట్టారు.. నీకు ఈ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తిను" అన్నారని చెప్పి నవ్వేసింది సింధు.