English | Telugu

ఓటిటి కన్నా యూట్యూబ్ చాలా డేంజర్

ఆలీతో సరదాగా షో కొత్త కొత్త అంశాలను బయటికి తెస్తూ ఉంటుంది. ఇక రాబోయే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి అశ్వినీదత్ గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అశ్వనిదత్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఓటిటి వ్యవస్థ కారణంగా థియేటర్లకు ఎవరూ వచ్చే అవకాశం ఉండదు కదా దీనిపై మీ అభిప్రాయం అని ఆలీ అడిగేసరికి ఓటిటి ఎంత మాత్రం ప్రమాదకరం కానీ కాదు యూట్యూబ్ ఈజ్ టూ డేంజరస్ అని చెప్పారు. ఆలీ తో సరదాగా షోకి అశ్వనీదత్ వచ్చి ఇద్దరూ కొట్టుకున్నారు అని యూట్యూబ్ లో పెడితే చాలు అన్ని పనులూ ఆపేసి మరీ ఆ న్యూస్ ని చదివేస్తారు.

ఇటీవలి కాలంలో చూస్తే స్ట్రైక్ అవి ఎక్కువయ్యాయి అని అడిగేసరికి మరి థియేటర్స్ రన్ అవ్వట్లేదు కదా. ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్గురు నలుగురు తమ చేతుల్లో పెట్టుకుని అన్ని థియేటర్స్ ని బ్లాక్ చేసేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ k సినిమా షూటింగ్ మొత్తం ఐపోయినట్టేనా అన్న ప్రశ్నకు చాలా వరకు పూర్తయ్యింది స్ట్రైక్స్ అవీ లేకపోతే షూటింగ్ పూర్తయ్యేది అన్నారు. ఇండస్ట్రీలో భారీ నిర్మాత అంటే అశ్వని దత్ పేరే చెప్తారు మరి మీరెందుకు నిరాశకు గురౌతున్నారు అన్న ప్రశ్నకు శక్తీ మూవీ తన లైఫ్ లో కోలుకోలేని దెబ్బ తీసిందని..ఆ మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళ నాన్న చనిపోవడం, రజనీకాంత్ గారు మాట వినకపోవడం, తన భార్య మాటల్ని లక్ష్య పెట్టకపోవడం అన్ని కలిసి తనని శక్తి హీనుడిని చేశాయని చెప్పుకొచ్చారు. బెస్ట్ ప్రొడ్యూసర్ స్వప్ననా, అశ్విని దత్త అని అడిగేసరికి ఈ తండ్రైనా తమ పిల్లలు తమని డామినేట్ చేస్తే చూడాలని అనుకుంటారు కదా నేను అంతే అని నవ్వేశారు అశ్వని దత్.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.