English | Telugu

నూకరాజుని, ప్రవీణ్ ని బాదేసిన సుమ

క్యాష్ దొరికినంత దోచుకో ఎపిసోడ్ గురించి అందులో వచ్చే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వారం ఎపిసోడ్ కి జబర్దస్త్ ఫామిలీ మెంబెర్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో వీసా ఇంటర్వూస్ చేస్తుంటుంది సుమ. అందరు జంటలు జంటలుగా రావాలని చెప్తుంది. వీసా కోసం భాను, కెవ్వు కార్తీక్ వస్తారు. అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అని అడిగేసరికి "ఒకేషన్" కి వెళ్ళాలి అంటాడు. "ఒకేషన్" ఆర్ "అకేషన్" అనే అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పకపోయేసరికి వీసా రిజెక్ట్ చేస్తుంది సుమ. ఇంతలో నూకరాజు ఆసియా వచ్చి మై ఫ్లైట్ ఈస్ మిస్సింగ్ అనేసరికి సుమ " వీసా రిజెక్టెడ్ " అని చెప్పి పంపేస్తుంది. ఏమి అర్థం కాక "ఆంటీ ఫస్ట్ యూ చెక్" అని నూకరాజు సుమని అంటాడు.. ఆంటీ అంటావా నన్ను అని వాటర్ బాటిల్ మీదకు విసిరేసి "నీ ఓవర్ యాక్షన్ ఎక్కడైనా కానీ నా దగ్గర కాదు" అంటుంది. ఇంతలో షబీనా, పరదేశి వచ్చేసి "కెన్ యూ ప్రొవైడ్ అజ్ వీసా" అని అడుగుతారు.. సుమ సీరియస్ ఐపోయి. "నేను ఇంకా మిమ్మల్ని పిలవలేదు లోపలి ఎందుకొచ్చారు అసలు గెటౌట్ ఆఫ్ మై ఆఫీస్ అంటూ" దేవి నాగవల్లి డైలాగ్ ని రిపీట్ చేస్తుంది సుమ.

తర్వాత ఫైమా, ప్రవీణ్ వచ్చి తల మీద వెంట్రుకలు పెట్టించుకోవడానికి అమెరికా పోతున్నాం అనేసరికి అసలు విషయం చెప్పు అంటుంది ఫైమా..ఆగే ..నేను చెప్తున్నాగా అంటూ ఫైమని కొడతాడు ప్రవీణ్ "నువ్వు ఆడపిల్లను కొడతావా యూ స్టుపిడ్ అంటూ ప్రవీణ్ ని పిచ్చ కొట్టుడు కొడుతోంది సుమ" ఇక నూకరాజు వచ్చి "యూ ఆర్ ది ఛాంపియన్ ఇన్ థిస్ wwf ఛాంపియన్ షిప్ " అంటాడు. ఆ డైలాగ్ కి నూకరాజు మీద వాటర్ బాటిల్ విసిరి ఫన్ చేస్తుంది సుమ.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.