సోలో బ్రతుకే సో బెటరూ.. హ్యాపీ సింగిల్స్ డే అంటున్న షన్ను!
షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఇద్దరూ కూడా యూట్యూబర్స్‌గా అందరికీ తెలుసు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. ఈ జంట చూడముచ్చటగా ఉండేది ఒకప్పుడు. కానీ షన్ను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి వచ్చాక ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన అందరూ మళ్ళీ కలిసి హాయ్‌లు చెప్పుకుని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే షన్ను-దీప్తి మాత్రం అస్సలు కలవడం లేదు.