English | Telugu
నాకు పిఆర్లు లేరు..పాజిటివ్ కామెంట్స్ కోసం ఒకరికి 25 వేలు ఇచ్చి మోసపోయాను
Updated : Nov 11, 2022
గలాటా గీతూకి బిగ్ బాస్ ఎలిమినేషన్ షాక్ బాగానే కొట్టింది. ఎందుకంటే ఇంకా ఆ షాక్ నుంచి కోలుకులేక అన్ని ఇంటర్వూస్ లో కన్నీరుమున్నీరవుతోంది. ఇక ఇప్పుడు కూడా తన ఎలిమినేషన్ కి గల కారణాలను రాసుకుని సుదీర్ఘంగా వివరిస్తూ ఒక గంట వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. " హౌస్లో నేను ప్రతి నిమిషం చాలా కరెక్ట్ గానే ఆడాను. అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా నాది ఫేక్ గేమ్ కాదు. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు.
నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేశారు. అందుకే హౌస్ నుంచి బయటికి వచ్చాక ఎవరితోనూ నేను మాట్లాడలేదు. ఒక రివ్యూవర్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫండ్ రైజ్ చేశాను. ఐనా అతనికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు. నేను పిఆర్ లను పెట్టుకోలేదు. ఫస్ట్ వీక్ లో నెగిటివ్ కామెంట్స్ కి పాజిటివ్ కామెంట్స్ వచ్చేలా చూడమని చెప్తూ ఒక వ్యక్తికి మాత్రం రూ. 25 వేలు ఇచ్చా. వాళ్ళు డబ్బు తీసుకుని చెక్కేశారు. నేను రివ్యూవర్ గా ఉన్నప్పుడు పిఆర్ లను పెట్టుకున్న వాళ్ళను బాగా విమర్శించాను కాబట్టి ఇప్పుడు నేను పిఆర్ లను పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు బయటికి వచ్చాక తెలుస్తోంది బిగ్ బాస్ కి పిఆర్ లు చాలా అవసరం అని. ఏదేమైనా నా ఆట కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యాను. మిగతా వారితో నా ప్రవర్తన ఆటలో భాగమే" అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది గీతూ.