English | Telugu

మైకేల్ జాక్సన్ తర్వాత నువ్వే!

ప్రతీ వారం సెలబ్రిటీలను తీసుకొచ్చే 'ఆలీతో సరదాగా' అనే టాక్ షో అంటే ఆడియన్స్ కి చాలా ఇష్టం. ఈ టాక్ షో ద్వారా సెలబ్రిటీల లైఫ్, కెరీర్ గురించి వాళ్ళ మాటల్లో నిజాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈ షో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫేమస్ యాక్టర్ తులసి, నటుడు ప్రభాస్ శ్రీను ఈ షోకి హాజరయ్యారు.

తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా విషయాలు ఈ షోలో చెప్పాడు శీను. అయితే.. నటుడిగా ప్రభాస్ శ్రీనులో ఇంతవరకు ఆడియన్స్ అంత కామెడీ యాంగిల్ నే చూసారు కానీ శీనులో మంచి డాన్సర్ కూడా ఉన్నాడనే విషయం ఈ షో ద్వారానే తెలిసింది. "శీను ఎక్కడ డాన్స్ నేర్చుకున్నావు నువ్వు" అని అడిగేసరికి "సాంగ్ పెట్టి డాన్స్ చేయమంటే ఎన్ని గంటలైనా చేస్తూనే ఉంటా... మీరు కౌంట్ ఇచ్చారా ఇక బండి వెళ్ళదు.." అని చెప్పాడు.

ఇక తర్వాత ఏక్ నిరంజన్ మూవీ నుంచి మైకేల్ జాక్సన్ మ్యూజిక్ తో వచ్చే సాంగ్ "అరెరే నర్తన తార" సాంగ్ ప్లే చేసేసరికి అద్దిరిపోయే స్టెప్పులు వేసి వావ్ అనిపించాడు. ఇక ఆలీ, తులసి ఆ స్టెప్స్ చూసి షాకయ్యారు. "మైకేల్ జాక్సన్ తర్వాత అలా డాన్స్ చేసేవాడిని నిన్నే చూసాను" అని అలీ అనేసరికి "ఇద్దరం నల్లగానే ఉంటాం కదా" అని ప్రభాస్ శీను కామెడీ గా ఆన్సర్ ఇచ్చాడు.