మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్.. మనం పెళ్లి చేసుకుందాం!
ఈటీవీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈవారం 'కమనీయం కార్తీకం' షోతో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి వ్యవహరించారు. ముందుగా ఈ షోని కారుణ్య పాడిన అద్భుతమైన శివుడి భక్తిగీతంతో మొదలు పెట్టారు. ఆ పాట వినేసరికి రోహిణి పూలమాల తెచ్చి కారుణ్య మేడలో వేసేసింది. "మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్ గా ఉంటున్నాం.. మనం పెళ్లి చేసుకుందాం" అని సడెన్ గా ప్రపోజల్ పెట్టేసరికి కారుణ్య షాకయ్యాడు.