English | Telugu
14 నుంచి స్టార్ మాలో 'కృష్ణ ముకుంద మురారి'!
Updated : Nov 12, 2022
స్టార్ మా ఛానెల్‌లో 'దేవత' సీరియల్ ప్లేస్‌లో'కృష్ణ ముకుంద మురారి' అనే ఒక కొత్త సీరియల్ ప్రసారం కావడానికి రెడీ అయ్యింది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ సీరియల్ బెంగాలీలో సూపర్హిట్ అయిన 'కుసుమ డోలా'కి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇక ఈ సీరియల్‌లో హీరో మురారి పాత్రలో గగన్ చిన్నప్ప నటిస్తున్నాడు. గగన్ కన్నడలో 'మంగళ గౌరీ మధువే' అనే సీరియల్‌లో నటించాడు. అలాగే బిగ్ బాస్ కన్నడసీజన్లో 8వకంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఇక ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా ప్రేరణ కంభం నటిస్తోంది. ఈమె కన్నడలో 'రంగనాయకి', 'హరహరమహాదేవ' అనే సీరియల్స్‌లోనటించింది. ఇంకా 'కరాళి', 'చురకత్తి' అనే మూవీస్‌లో నటించింది. అలాగే ఈ సీరియల్‌లో సెకండ్ హీరోయిన్‌గా యష్మి గౌడ నటిస్తోంది. ఈమె 'నాగ భైరవి' సీరియల్‌లో భైరవిగా నటించింది.
ఇంకా ఈ సీరియల్‌లో ప్రభాకర్ హీరోయిన్ తండ్రిగా కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిన ఈ సీరియల్ తెలుగులో ఎలా ఉండబోతుంది,ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక ఈ కొత్త సీరియల్ నవంబర్ 14 నుంచి స్టార్ మాలో రాత్రి 8.30 గంటలకు ప్రసారం కాబోతోంది.