English | Telugu
తన గొయ్యి తానే తవ్వుకుంటున్న ఫైమా..తనకి ఎలిమినేషన్ తప్పేలా లేదు!
Updated : Nov 11, 2022
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఆటతీరుకి ప్రేక్షకులు స్పందిస్తూ, తమ అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో చూపిస్తారు. అయితే గేమ్ ఎంత బాగా ఆడినా, నోటి దురుసు ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చేయడం కామన్ గా జరిగేదే. గత వారం గీతు ఎలిమినేట్ అవ్వడానికి కూడా తన రూడ్ బిహేవియర్ అని అందరికి తెలుసు. కాగా ఈ వారం ఫైమా మీద కూడా అలాంటిదే రిపీట్ అవుతోంది.
బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లో ఆటతో పాటు, మాటలను అదుపుచేసుకోవాలి. కానీ ఫైమా గత మూడు రోజులుగా సాగుతోన్న టాస్క్ లో ప్రతీ ఒక్కరితో నోటి దురుసును చూపిస్తుంది. కాగా ఈ ప్రవర్తన వల్ల తను ఓటింగ్ లో చివరి స్థానంలో ఉంది. ఇలా పర్ఫామెన్స్ చేస్తే ప్రేక్షకులు ఓట్లు వేయరు అనే చిన్న లాజిక్ మర్చిపోయినట్టుంది. తన జబర్దస్త్ జోక్ లు నాన్ సింక్ లో ఉండటం. ఇనయాతో కావాలని గొడవకి దిగడం. రేవంత్ తో వాగ్వాదం. ఇవన్నీ చూసే ప్రేక్షకులకు చాలా ఇరిటేటింగ్ ని కలుగజేస్తున్నాయి.
అయితే వసంతి, ఫైమా చివరి రెండు స్థానాలలో ఉండగా, వసంతి గొడవలు ఏమీ లేకుండా సైలెంట్ గా ఉండటం. అనవరంగా నోరు జారకపోవడంతో ఓటింగ్ లో తన గ్రాఫ్ మెరుగపడి, ఫైమా కన్నా లీడింగ్ లో ఉంది. అయితే ఈ రెండు రోజుల గేమ్ లో ఫైమా తన బిహేవియర్ మార్చుకోకపోతే హౌస్ నుండి బయటకే అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఏ గొడవలకు పోకుండా, సైలెంట్ గా ఉంటూ, బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుందో లేక చిరాకు తెప్పించి బయటకు వస్తుందో చూడాలి మరి.