English | Telugu
దేవత సీరియల్ కి ఎండ్ కార్డ్..త్వరలో పార్ట్-2 తో రీఎంట్రీ!
Updated : Nov 12, 2022
దేవత సీరియల్ కి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఈ విషయాన్ని సీరియల్ టీం ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపింది. 2020 ఆగష్టు నుంచి స్టార్ మా ఛానల్‌లో స్టార్ట్ అయ్యింది.
‘దేవత సీరియల్ అయిపోయింది.. పార్ట్ 2తో మళ్లీ వస్తాం.. తొందర్లోనే మేం అంతా మళ్ళీ కలుస్తాం.. మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ రుణపడి ఉంటాం’ అంటూ ఈ సీరియల్ లో భాగ్యమ్మ రోల్ లో నటించిన నటకుమారి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ సీరియల్ ముక్కోణ ప్రేమ కథ. రుక్మిణిగా సుహాసిని, ఆదిత్యగా అర్జున్ అంబటి లీడ్ రోల్ పోషించారు. వీరితో పాటు సత్య, మాధవ, దేవి, చిన్మయి, భాగ్యమ్మ, దేవుడమ్మ, కమల, సూరి, రంగ, రాజమ్మ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
కొంచెం సాగతీతగా అనిపించినా కూడా దేవత సీరియల్ మంచి రేటింగ్‌తో దూసుకుపోయింది. అయితే త్వరలో దేవత - 2 ఉంటుందని ఈ సీరియల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పడంతో ఆడియన్స్ ఫుల్ కుష్ లో ఉన్నారు.