English | Telugu
అక్కడ చాలా పాలిటిక్స్ ఉంటాయి..ఆది, సుధీర్ మీద కామెంట్స్ వైరల్
Updated : Nov 10, 2022
అదుర్స్ ఆనంద్ ఒకప్పుడు జబర్దస్త్ లో దాదాపు ఐదేళ్లు చమ్మక్ చంద్ర టీమ్ లో కంటెస్టెంట్ గా చేసేవాడు. తర్వాత ఈ షో నుంచి చమ్మక్ చంద్ర తప్పుకున్న తర్వాత ఆనంద్‌కు టీమ్ లీడర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత తనను జబర్దస్త్ నుంచి బయటకి వెళ్లిపోయేలా చేశారు చాలామంది అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. "పాత డైరెక్టర్స్ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు టాప్ రేటింగ్ లో ఉన్న టీంలీడర్స్ మాటనే వినేవాళ్ళు. మరి నా స్కిట్స్ నచ్చలేదా..లేదా నేను నచ్చలేదా అనే విషయం తెలియదు. నా టీంని షో నుంచి తీసేయమని చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అవి నిజమైన పబ్లిక్ పెట్టారో లేదా పెట్టించారో తెలియదు నాకు. ఆ తర్వాత జబర్దస్త్ గంటన్నర షో నుంచి వన్ అవర్ షోకి వచ్చేసరికి 5 టీమ్స్ ని సెలెక్ట్ చేసి నాది ఆరవ టీమ్ అయ్యేసరికి నన్ను బయటికి వెళ్లిపోయేలా చేశారు.
నాకు పిల్లలు, ఫామిలీ ఉంది..అలాంటి టైములో వాళ్లకు చేతులెత్తి కూడా మొక్కాను. ఐనా వాళ్ళు నా గురించి ఆలోచించలేదు.. ఒక టైంలో నా టీంలో నేనేంటి అనే విషయం నాకే అర్ధం కాలేదు. తర్వాత నాకు ఎవరూ ఫోన్స్ చేయలేదు. ధనరాజ్ అన్న నన్ను చేరదీసాడు. ఎవరు ఎవరినీ తొక్కేయలేరు..హైపర్ ఆది గారు, సుడిగాలి సుధీర్ గారు స్కిట్స్ మాత్రమే విన్నింగ్ అనుకుంటే ఎలా...డైరెక్టర్స్ కి ఏ టీం లీడర్ ఐనా విన్ అవకపోతే వాళ్లకు ఒక ఫోబియా ఉంటుంది..ఇంకా వాళ్ళు విన్ ఎవరు అని..ఏదేమైనా నేను బయటికి వచ్చేసి యూట్యూబ్ పెట్టుకున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, మూవీస్ లో చేస్తున్నా, జబర్దస్త్ నుంచి బయటికి వచేసాక "ఆకాశమంత" అనే సీరియల్ ఒకటి చేసాను, మూవీస్ లో, వెబ్ సిరీస్ లో చేస్తున్నా. అలాగే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని కాబట్టి నాకు బయట ఈవెంట్స్ అవి వచ్చినప్పుడు చేస్తూనే ఉన్నా. " అని ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.