English | Telugu
ఎవరు రాకపోయినా 'జబర్దస్త్' చేయడానికి నేను రెడీ!
Updated : Nov 10, 2022
జబర్దస్త్ షోకి జబర్దస్త్ గా కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చేసింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమె ఇక నుంచి ఈ షోని నడిపించబోతోంది. వస్తూనే తన మార్క్ కామెడీని చేసి ఆదికి కౌంటర్ వేసింది. ఐతే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేకుండా రష్మిని సడెన్గా ఆపేసి కొత్త యాంకర్ ని తీసుకొచ్చేసరికి మీడియా అటెన్షన్ మొత్తం రష్మీ మీదకు మళ్లింది. అనసూయ వెళ్ళిపోతున్నట్లు ముందుగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా ప్రకటించి మరీ వెళ్ళింది. కానీ రష్మీ విషయంలో అలా జరగలేదు.
సరే పోనీ కొత్త యాంకర్ రానే వచ్చింది షోకి యాంకరింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. మరి రష్మీ ఫీలింగ్ ఏమిటో అంటూ కెమెరాలు, మైకులు అన్నీ ఇప్పుడు రష్మీని టార్గెట్ చేశాయి. దానికి రష్మీ "సౌమ్య రావు మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు. నా స్థానంలోకి కొత్త యాంకర్ వస్తుందని ముందే చెప్పారు. నేను కూడా స్టాండ్ బై గా వచ్చానని ఎప్పుడో చెప్పా కదా. అనసూయ మానేయడంతో కొత్త యాంకర్ ని తీసుకునే వరకు నన్ను యాంకర్ గా ఉండమన్నారు. అలాగే చేసాను. ఎప్పుడైనా అనసూయకి షో చేయడం కుదరని పక్షంలో నేను స్టాండ్ బైగా కూడా చేసాను. ఇన్-కేసు రేపు సౌమ్యరావుకి ఏదైనా కుదరని పక్షంలో అప్పుడు కూడా నేను ఈ షో చేస్తాను. ఇది నా మల్లెమాల.. నా షో... జబర్దస్త్ యాంకర్ గా నేను వ్యవహరించేది కొద్దికాలమే అని నాకు తెలుసు, కాబట్టి ఈ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు." అని చెప్పుకొచ్చింది.
ఇక సౌమ్యరావు రాకతో రష్మీ ఎక్స్ట్రా ఇన్కమ్ ను కోల్పోయారు అనే విషయం అర్ధమవుతోంది. దానికి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది సెటైర్ కూడా వేసాడు. జబర్దస్త్ యాంకర్స్ గా రష్మీ గౌతమ్, అనసూయ ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్లారు. వాళ్ళు లేకపోతే షో లేదు అన్నట్టుగా మెస్మరైజ్ చేసేసారు. ఇక ఇప్పుడు సౌమ్య రావు వంతు వచ్చింది. ఆ ఇద్దరినీ ఆమె బీటౌట్ చేస్తే మాత్రం ఆమె దశ తిరిగినట్టే లేదంటే ఆడియన్స్ నుంచి విమర్శలు తప్పవు.