English | Telugu

కొత్త టీమ్స్ కి స్కిట్స్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్న ఆది!

హైపర్ ఆది జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. కాబట్టి స్కిట్ ఎలా చేయాలి...ప్రోమోకి ఎలాంటి డైలాగ్ చెప్పాలి...ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అన్ని తెలుసు.

ఇక ఇప్పుడు జబర్దస్త్ కి వస్తున్నా కొత్త టీమ్స్ కి సూపర్ సీనియర్ అని చెప్పొచ్చు. ఇక ఆది కొత్తగా వచ్చే కమెడియన్స్ కి యాక్టింగ్ టిప్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా ఒక టీంకి రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో క్లాస్ పీకాడు. కిలాడి కాజా పేరుతో ఒక టీమ్ ఈమధ్య జబర్దస్త్ స్టేజి పైన కనిపిస్తోంది. ఈ టీంలో ఒక కమెడియన్ అసలేం మాట్లాడతాడో అర్ధమే కాదు, అసలది ఏ భాషో కూడా తెలీదు అనిపించేలా డైలాగ్ చెప్పాడు. ఇక పక్కన ఉండి చూస్తున్న హైపర్ ఆది స్టేజి మీదకు వచ్చి "మనం కామెడీ చేసేటప్పుడు ఎడిటర్స్ వెనక్కి వెళ్ళాలి, జడ్జెస్ ముందు రావాలి కానీ మీరు ఎడిటర్స్ ముందుకొచ్చేలా జడ్జెస్ వెనక్కి వెళ్లిపోయేలా స్కిట్ పెర్ఫామ్ చేస్తున్నారు." అని అదిరిపోయే టిప్ ఒకటి ఇచ్చాడు.

తర్వాత "ఇంతకు నీ పేరేంట్రా" అని అడిగేసరికి "ఖిలాడీ ఖాజా" అంటి గట్టిగా అరిచి చెప్పేసరికి "300 ఎపిసోడ్లు చేసిన నేను కూడా ఎప్పుడూ నా పేరుని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదు." అని ఆది కౌంటర్ వేసి కొత్త టీమ్స్ కి స్కిట్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాన్ని చెప్పాడు.