English | Telugu

నా ఆట ఏంటో చూపిస్తానంటోన్న రేవంత్..ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా?

బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తంలో అగ్రెసివ్ బిహేవియర్ ఎవరికి ఉంది అంటే, అందరు ఠక్కున రేవంత్ పేరు చెప్పేస్తారు. అలాంటి రేవంత్ మెల్లి, మెల్లిగా కామ్ అయి, మారిపోతున్నాడు.

గత వారం "అగ్రెసివ్ బిహేవియర్ తో పాటు పక్కన హౌస్ మేట్స్ తో జాగ్రత్తగా ఉండాలి. అలా లేనందున నీకు ఎల్లో కార్డ్ ఇస్తున్నా, నెక్స్ట్ ఇక రెడ్ కార్డ్ " అని నాగార్జున చెప్పాడు. దీంతో రేవంత్ చాలా చేంజ్ అయ్యాడు. అయితే మొన్న జరిగిన 'నాగమణి' టాస్క్ లో తను రత్నాలు కాపాడుకునే ప్రయత్నంలో, "ఫిజికల్ అవకు రేవంత్" అని ఆదిరెడ్డి ఒక వైపు, "ఫిజికల్ కాకుండా ఆడు" అని ఫైమా మరో వైపు, "గేమ్ ఆడు రేవంత్" అని శ్రీసత్య అరవడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు రేవంత్. "నేను ఏం ఫిజికల్ అవ్వట్లేదు అని చెప్పినా ఎవరూ వినకుండా ఫిజికల్ అంటే ఎలా ఆడేది" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత గేమ్ లో రేవంత్, శ్రీసత్య కి సపోర్ట్ చేస్తుండగా, "రేవంత్ నా తల ఉంది పక్కకి వెళ్ళు" అని శ్రీసత్య అంది‌. "సరే నా వల్లే ప్రాబ్లమా" అని పక్కకి వెళ్ళిపోయాడు రేవంత్ . అలా ఆ రోజు అంతా గేమ్ ఆడలేదు. ఆ తర్వాత ఒక్కడే కూర్చొని ఏడుస్తూ మాట్లాడుకున్నాడు. "అంత కష్టపడి మట్టి తెచ్చి ఆడినా, నాకు ప్రతిఫలం రాలేదు. అసలు రాకుండా ఉండాల్సింది భయ్యా" అని రేవంత్ అన్నాడు. "వదిలెయ్ రేవంత్. దట్ ఈజ్ గేమ్. ఎక్కువ థింక్ చేస్తే లూసర్ అవుతావ్" అని ఆదిరెడ్డి అన్నాడు.

ఆ తర్వాత మెరీనా వచ్చి ఓదార్చింది. "నీ ఆట నువ్వు ఆడు. దిజ్ ఈజ్ గేమ్. గట్టిగా ఆడు. సపోర్ట్ కావాలంటే ప్లీజ్ కాల్ మి. నేను సపోర్ట్ చేస్తాను" అని రేవంత్, మెరీనాతో అన్నాడు. ఆ తర్వాత ఒక్కడే కూర్చొని మాట్లాడుకున్నాడు. "ఆట ఆడకుండా కాళ్ళు చేతులు కట్టేసారు బిగ్ బాస్. ఆడితే ఫిజికల్ అంటున్నారు. ఈ రోజు నేను గేమ్ ఆడలేకపోయాను. నాలా నేను లేనప్పుడు, గుండె పగిలిపోయింది బిగ్ బాస్. నా ఆట ఏంటో చూపిస్తా. చివరి వరకు ఉండి ఈ సీజన్ లో విజేతని అవుతా బిగ్ బాస్ " అని రేవంత్ చెప్పుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ అగ్రెసివ్ ని పక్కన పెట్టి, ఆలోచించి ఆడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ రకంగా అగ్రెసివ్ బిహేవియర్ తగ్గించుకొని కామ్ గా టాస్క్ ఆడితే రేవంత్ టాప్ త్రీ లో ఉంటాడు అని అనడంలో సందేహమే లేదు. ఈ సీజన్ లో విజేతగా నిలిచే ఛాన్స్ లు ఎక్కువగా రేవంత్ కే ఉన్నాయి. ఎందుకంటే ప్రతీవారం రేవంత్ ఓటింగ్ లో టాప్ లో ఉంటున్నాడు.