English | Telugu

నాగ్ వేస్ట్.. నాని బెస్ట్.. గీతూ షాకింగ్ కామెంట్స్!

గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాక ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున హోస్టింగ్ మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇంటర్వ్యూలో "ఇన్ని సీజన్స్ లో ఎవరి హోస్టింగ్ బెస్ట్.. అలాగే నెక్స్ట్ సీజన్ కి ఏ హోస్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు" అని యాంకర్ అడిగేసరికి "అన్ని సీజన్స్ లోకి నాని హోస్టింగ్ ది బెస్ట్ అని చెప్తా. చాలా మంది అన్నారు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ అదరగొట్టారని కానీ ఫస్ట్ సీజన్ చూడలేదు కాబట్టి నాకు తెలీదు. నా వరకు నాని హోస్టింగ్ బాగా నచ్చుతుంది. నాగార్జున గారు వీకెండ్స్ లో వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళను రోస్ట్ చేసేస్తారని అనుకుంటాను.. కానీ అక్కడంతా రివర్స్ అవుతుంది. వాళ్ళను నెమ్మదిగా బుజ్జగించి మాట్లాడతారు, తప్పు చేయని వాళ్ళను తిడతారు. ఇది నాకు నచ్చలేదు. నెక్స్ట్ సీజన్ కి బిగ్ బాస్ హోస్ట్ గా రామ్ గోపాల్ వర్మ గారు వస్తే బాగుటుంది కానీ ఆయన అమ్మాయిలకే ఫేవర్ గా మాట్లాడతారు. రానా, విజయదేవరకొండ హోస్ట్స్ గా వస్తే ఇంకా బాగుంటుంది. అందరికన్నా నాని ఏక్దం ఫస్ట్ క్లాస్ గా చేశారు. తప్పు చేసిన వాళ్ళను ఆయన షంటుతూనే ఉంటారు. అందుకే నాని హోస్టింగ్ బెస్ట్ అందరిలోకి..నెక్స్ట్ సీజన్ కి నాని వస్తే బాగుంటుంది" అంది గీతూ.

ఆల్రెడీ నాగ్ హోస్టింగ్ మీద ఆడియన్స్ కి పెద్ద ఆసక్తి లేనట్లుగానే కనిపిస్తోంది. కానీ మరి ఎందుకో ఆయన్నే హోస్ట్ తీసుకొస్తున్నారో అర్ధం కావట్లేదు. బిగ్ బాస్ టీం ఈ కామెంట్స్ విని నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ ని చేంజ్ చేస్తారా లేదా అనే విషయం చూడాలి.