English | Telugu

సోలో బ్రతుకే సో బెటరూ.. హ్యాపీ సింగిల్స్ డే అంటున్న షన్ను!

షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఇద్దరూ కూడా యూట్యూబర్స్‌గా అందరికీ తెలుసు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. ఈ జంట చూడముచ్చటగా ఉండేది ఒకప్పుడు. కానీ షన్ను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి వచ్చాక ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన అందరూ మళ్ళీ కలిసి హాయ్‌లు చెప్పుకుని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే షన్ను-దీప్తి మాత్రం అస్సలు కలవడం లేదు. 'అరే బాబు పంతాలు వదిలేసి కలవండిరా' అని నెటిజన్స్ చెప్పినా నో యూజ్.. ఎవరికి వారే సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఇక ఇలాంటి సింగిల్స్ కోసం ఒక స్పెషల్ డే కూడా ఉంది. అది ఎప్పుడు అనుకుంటున్నారా? నవంబర్ 11న సింగిల్స్ డే జరుపుకుంటారు. ఇంతకీ ఈసింగిల్స్ డే అంటే ఏమిటబ్బా?.. అనే సందేహం మీకు వచ్చింది కదా. చైనాలో దీన్ని ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటారు. 1993 నుంచి ఈ రోజును సింగిల్స్ డేగా అంటే బ్యాచిలర్స్ డేగా చేసుకుంటున్నారు. నాన్జింగ్ యూనివర్సిటీలో మొదట ఈ సింగిల్స్ డే అనేది స్టార్ట్ అయ్యింది. 11వ నెల 11వ తేదీ ఈ అంకెలు అన్ని సింగల్ గానే ఉన్నాయి అని గుర్తించిన ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇదే రోజున సింగిల్స్ డేగా జరుపుకుంటే బాగుటుందని యూనివర్సిటీలోని బ్యాచిలర్స్ అంతా సెలెబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారట.

తర్వాత ఈ సెలెబ్రేషన్స్ మిగతా యూనివర్సిటీస్‌కి కూడా పాకేసరికి అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు దీప్తి నుంచి విడిపోయాక సింగిల్‌గా ఉన్నాడు కాబట్టి ఈ పండగను సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించి విషెస్ చెప్తూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా పోస్ట్ చేసుకున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.