English | Telugu

పెళ్ళైనా కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించొచ్చు అని ఎలా చెప్పావ్

ఆలీతో ఆల్ ఇన్ వన్ షో ప్రతీ వారం నవ్వు తెప్పిస్తూ ఉంది. ఆలీని చూస్తే చాలు ఎవరైనా పగలబడి నవ్వుకోవాల్సిందే. అలాంటి ఆలీ బుల్లితెర మీద సిల్వర్ స్క్రీన్ మీద హిట్ ఐన వాళ్లందరినీ తన షోకి పిలిచి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. ఇక ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆట సందీప్ అతని వైఫ్ జ్యోతి రాజ్, ప్రాచి వచ్చారు. జ్యోతి స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వగానే ఆలీ ఒక ప్రశ్న వేశారు "జనరల్ గా మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఫైర్ అవుతారు కానీ నువ్వెంటి రివర్స్ లో మీ ఆయన మీద ఫైర్ అవుతున్నావ్" అని అడిగేసరికి ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది జ్యోతి. "ప్రతీ వైఫ్ ఫైర్ అవడానికి వెనక ఒక రీజన్ ఉంటుంది.

నేను ఎప్పుడూ మా ఆయన ముందు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటా

ఆర్జే కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా తెలుసు కానీ  ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఈమె వాగుడుకాయ,  యూట్యూబర్‌, రేడియో జాకీ, వీడియో జాకీ, సింగర్‌, యాంకర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ , యాక్టర్ ఒక్కటేమిటి మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటుంది. ఈ టాలెంట్స్ అన్ని కాజల్ సొంతం. బిగ్ బాస్ హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానుల మెప్పు పొందింది కూడా. ఈమె వాయిస్ కి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. అలాంటి కాజల్ సోషల్ మీడియాలో కూడా లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటుంది. తన ఇంట్లో చేసే పనులు, ఫంక్షన్స్ గురించి అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

షాక్ లో కళ్ళు తిరిగిపడిపోయిన అలేఖ్య.. కృష్ణ, మురారీల మధ్య  పెరిగిన దూరం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-220 లో.. సన్మానం నుండి బయటకు వెళ్ళిపోయిన కృష్ణ అప్పడే ఇంటికి వస్తాడు. అక్కడ హాల్లో అందరు మురారి కోసం ఎదురుచూస్తుంటారు. రాగానే ఎక్కడికి వెళ్ళావ్ మురారి అని భవాని అడుగగా.. అర్జెంట్ కాల్ వచ్చిందని మురారి చెప్తాడు. అది విన్న ముకుంద.. అంత అర్జెంట్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏమైన గొడవలు ఉన్నాయా?  అంత అవసరమేంటి? మీ గొడవలని ఇలా బయటపెట్టుకోవడమెందుకని మురారితో అంటుంది. అప్పటికే మురారిలి డౌట్ వస్తుంది. కానీ అవన్నీ నీకెందుకు ముకుంద అని కవర్ చేయాలని చూస్తుంది.

అలాంటి వీడియోస్ రాత్రి పెడితేనే బాగుంటాయన్న శ్రీసత్య!

శ్రీసత్య.. బిగ్ బాస్ ప్రియులకు సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-6 లో 'బ్యూటీ క్వీన్' అని  చెప్తారు. మొన్న జరిగిన శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడిపిన శ్రీసత్య.. ఆ తర్వాత రేవంత్, శ్రీహాన్ లతో కలిసి స్నేహమంటూ గ్రూప్ గా ఆడింది. హౌస్ లో ఫ్యామిలీ వీక్ ముందు వరకు శ్రీసత్య కచ్చితంగా వెళ్ళిపోతుందనుకున్నారంతా కానీ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మనాన్న రావడంతో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తనకున్న నెగెటివ్ టాక్ కాస్త అమ్మ సెంటిమెంట్ తో పాజిటివ్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉన్న శ్రీసత్య ఫైనల్ కి వారం ముందు ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది. 

ఈ పెర్ఫార్మెన్స్ కి కాస్ట్లీ బట్టలు అవసరమా అంటూ అఖిల్ మీద ఆది సెటైర్స్

ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం షోలో ఆది మందు బాటిల్ పట్టుకుని చేసిన ఓవర్ యాక్షన్ మాములుగా లేదు. ప్రతీ వారం ఆది ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటాడు. ఈ వారం షో మొత్తం మందు తాగుతూ, చికెన్ పీస్ తింటూ కనిపించాడు.  ఈ షోలో అఖిల్ సార్థక్ దీపికా పిల్లికి బావ రోల్ లో వచ్చాడు. అఖిల్ సార్థక్ ని, శేఖర్ మాష్టర్ ని ఒక రేంజ్ మాటలతో ఆడేసుకున్నాడు. అఖిల్ బ్లాక్ కాలర్ థిన్ షర్ట్ తో వచ్చేసరికి "షర్టు, ఫాంటు ఎంత" అని అఖిల్ ని అడిగాడు ఆది. " ఎంతో కొంతలే" అని అఖిల్ రివర్స్ లో కౌంటర్ వేసాడు . "మనమిచ్చే 500 పెర్ఫార్మెన్స్ కి 10 వేల బట్టలు అవసరమా" అని ఆది అనేసరికి అఖిల్ సార్థక్ హార్ట్ అయ్యాడు.

శివ్ కి డెంగీ పాజిటివ్..నీతోనే డాన్స్ నుంచి ఈ వారం బ్రేక్

"నీతోనే డాన్స్" నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోకి "బ్రో" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ  కూడా వచ్చారు. ఐతే ఈ ఎపిసోడ్ కి శివ్-ప్రియాంక రాలేకపోయారు. ఈ విషయాన్ని హోస్ట్ శ్రీముఖి జడ్జెస్ తో కూడా చెప్పింది. ఐతే వీళ్ళు ఎందుకు రాలేకపోయారు అనే విషయాన్ని ప్రియాంక ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. "శివ్ కి 103 ఫీవర్ ఉండేసరికి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఇక తనకు సెలైన్ కూడా పెట్టారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన హెల్త్ బాగా అప్సెట్ అయ్యింది అని చెప్పింది.

రాజ్ కి సాటిమనిషి విలువ తెలియజేసిన కావ్య.. స్వప్న సెలబ్రిటీ అయిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో.. కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నీకు రాజ్ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని కావ్యతో అంటుంది.. ఆయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు సపోర్ట్ గా ఉండరని కావ్య అనగానే.. అప్పుడే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు రాజ్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ చిన్నప్పటి నుండి రాజ్ ని చూస్తున్న నాకు రాజ్ గురించి బాగా తెలుసు. రాజ్ లో మార్పు మొదలు అయిందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ మారిపోయాక రాజ్ చుట్టూ తిరుగుతావని ధాన్యలక్ష్మి అంటుంది. తిరుగుతాను సాటి మనిషికి భార్యకు తేడా ఏంటో తనకి తెలియజేస్తానని కావ్య అనుకుంటుంది.