English | Telugu

నువ్వు కావాలయ్య అంటూ స్టెప్పులేసిన వాసంతి కృష్ణన్, సుదీప!

బిగ్ బాస్ సీజన్-6 లో బ్యూటీ క్వీన్ గా వాసంతి కృష్ణన్ ని పిలుస్తారు‌. తన గ్లామర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాసంతి. హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనుకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి.

ఇంకొన్ని స్టెప్స్ , డాన్స్ ఉంటే బాగుండు అన్న కామెంట్స్ కి సెట్ లో రచ్చరచ్చ...

"నీతోనే డాన్స్" ఈ వారం రెండు రోజులు జరిగిన షోలో రెండు జంటలు కొంచెం అగ్రెసివ్ గా ప్రవర్తించినట్టు అనిపించింది. నటరాజ్ మాష్టర్ - నీతూ రెట్రో రౌండ్ లో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ గెటప్స్ తో వాళ్ళ సాంగ్స్ కి డాన్స్ చేశారు..ఐతే వీళ్లకు అంజలి, పవన్ , కావ్య, నిఖిల్ జంటలు చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. "ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటే బాగుండు అని పవన్ నటరాజ్ మాష్టర్ కి చెప్పేసరికి ఇంకా స్టెప్స్ కావాలా..ఇప్పటికే చాలా స్టెప్స్ వేసాం..ఈ డాన్సస్ ని ఒరిజినల్ క్యారెక్టర్స్ లో ఉన్నవాళ్లు ఉంటే ఎలా చేస్తారో చేసాం" అని చెప్పారు. "అసలు వాళ్ళ సాంగ్స్ లో ఇన్ని మూవ్మెంట్స్ ఉండవు కానీ మేము ఇంకా ఇంప్రొవైజ్ చేసి చూపించాం" అన్నారు.

ఆదిని కిడ్నాప్ చేసిన లేడీస్...పెళ్ళెప్పుడు అని అడిగిన మహిళా రైతులు

బుల్లితెర అంటే చాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదువే ఉండదు. ఎన్నో షోస్ ఉన్నాయి. కానీ వాటిల్లో సూపర్ గా కామెడీతో కలిపి ఎంటర్టైన్ చేసేది జబర్దస్త్ ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో ఆది చేసే కామెడీ పంచెస్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి ఆది మీద లేడీస్ వైపు నుంచి చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి లేడీస్ అంతా కలిసి ఆది మీద తిరగబడ్డారు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో  చాలామంది సీనియర్ యాక్టర్స్ కనిపించారు.  జయవాణి, ప్రీతి నిగమ్, శిల్పా చక్రవర్తి, భావన లాంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో పాటు ప్రస్తుతం చేస్తున్న యాంకర్స్  కూడా ఉన్నారు. వీళ్లందరితో కలిపి చేసిన ఈ షో నెక్స్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. అది కూడా  ‘ఆది కిడ్నాప్’ అనే కాన్సెప్ట్ తో వస్తోంది.

మన భారత దేశం యూనిఫామ్ నైటీ అన్న సుమ

"సుమ అడ్డా" నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్  ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఆర్జే కాజల్, విజె సన్నీ, చలాకి చంటి, సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే చంటికి సమోసాలు ఆఫర్ చేసింది సుమ. "ఫ్రెష్ వేనా" అని అడిగేసరికి "నిజానికి లాస్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేశారు క్యాన్సిల్ అయ్యింది" అనేసరికి "అది అలా చెప్పాలి కదా అప్పుడు తింటాం కదా" అని చంటి అనేసరికి "ఏమైనా అప్పటి మనుషులు అప్పటివే తింటారుగా" అని కామెడీ చేసింది సుమ. తర్వాత సన్నీ, కాజల్ తో గేమ్ షో ఆడించింది. అందులో "పల్లెటూరు అనగానే గుర్తోచ్చేదిమిటి" అనేసరికి కాజల్ "హాఫ్ సారీస్" అని చెప్పింది...ఐతే బోర్డు ఆన్సర్ రాంగ్ అని చెప్పడంతో సన్నీ షాకయ్యాడు. "ఏమిటి లంగా ఓణీలు వేసుకోవడం మానేసారా" అనేసరికి సుమ మధ్యలో వచ్చింది. "మన భారత దేశం యూనిఫామ్ ఏమిటో తెలుసా" అని అడిగింది "జీన్స్ , టి షర్ట్ ఆ" అని అడిగారు సన్నీ, కాజల్.. "కాదు నైటీ" అనేసరికి అందరూ నవ్వేశారు.

ఈ విషయాన్ని త్వరలో ఒక పెద్ద షోలో చెప్తాను అన్న వర్షా..అది బిగ్ బాసేనా ?

బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి జబర్దస్త్ కమెడియన్ వర్ష రెడీ ఐనట్టు తన మాటల ద్వారా అర్ధమయ్యి కానట్టుగా ఉంది. బిగ్ బాస్ లోగో రిలీజ్ ఐన దగ్గర వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అంటూ సోషల్ మీడియాలో  హడావిడి మొదలయ్యింది..రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన వర్షను యాంకర్ ఆమె చదువు గురించి అడిగారు..దానికి వర్ష గట్టిగా నవ్వుతూ  " ఇది ఇక్కడ చెప్పను..ఒక పెద్ద షో కి వెళ్తున్నాను నెక్స్ట్...ఆ షోలో చెప్తాను" అనేసరికి యాంకర్ " హో మాకు తెలుసు, మీరు ఏ షోకి వెళ్తున్నారో..రివీల్ చేసేయమంటారా" అని అడిగింది. దానికి వర్ష నవ్వేసి "వొద్దొద్దు" అని అంది. "ఏ పేమెంట్ రాదంటారా..అగ్గ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందంటారా" అని యాంకర్ అనేసరికి. " కొన్ని చెక్స్ ముందే ఇచ్చేసారు నాకు చెప్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయని దాచి ఉంచా" అని చెప్పింది వర్ష.

కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్...హాస్పిటల్ బెడ్ పై కాళ్లకు కట్టుతో ...

కొంతకాలం నుంచి సెలబ్రిటీస్ ఏదో ఒక ఇన్సిడెంట్ లో గాయాల పాలై హాస్పిటల్ బెడ్ మీదో లేదా హ్యాండ్ స్టిక్స్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నారు...నవదీప్, వరుణ్ సందేశ్, రౌడీ రోహిణి ఇలా చాలా మంది కూడా కళ్ళకు గాయాలతో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బుల్లితెర మీద కాస్తో కూస్తూ పేరు తెచ్చుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యాదమ్మ రాజు- స్టెల్లా జంట గురించి మనకు తెలుసు. జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు.  అటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ లోనో సందడి చేస్తూ ఉంటారు వీళ్ళు.  లాస్ట్ ఇయర్ స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక స్టెల్లా అమెరికా వెళ్లి వచ్చి రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోకి వెళ్లారు. ఐతే అక్కడ ఎలిమినేట్ ఐపోయి ప్రస్తుతం మిగతా షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి యాదమ్మ రాజు   హాస్పిటల్ గౌన్ లో కాళ్లకు కట్టుతో కనిపించాడు.