English | Telugu

సుమ మెడలో పూల దండేసిన విరాజ్..."బేబీ"ని హగ్ చేసుకున్న కింగ్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బిగ్ బాస్ సీజన్ 7 కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సందడి వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ ఐపోయింది. "కుడి ఎడమైతే" అంటూ కింగ్ నాగార్జున చెప్పారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ బిబి హౌస్‌మెట్స్ తో కలిసి ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్‌లోని సిక్స్ సీజన్స్‌లో ఉన్న స్టార్స్ అందర్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సందడి చేయడానికి రెడీ ఇపోయారు. ఈ షైనింగ్ స్టార్స్ ఎపిసోడ్ కి ‘బేబి’ టీమ్, ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్ ’ టీమ్ వచ్చారు. అలాగే అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ కూడా వచ్చి సందడి చేశారు.

ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా అద్భుతమైన సింగింగ్, డాన్సింగ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. సుమ హోస్టింగ్ అంటే మామూలు విషయం కాదు. ‘బేబి’ టీం వచ్చేసరికి సుమకి ఇంకా జోష్ ఎక్కువయ్యింది. హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న మూడో అతను ఎక్కడ అని అడిగేసరికి ఆనంద్ దేవరకొండ షాకయ్యాడు. ఎవరూ దానికి ఆన్సర్ చెప్పలేదు. ఇక విరాజ్ ఐతే పూల దండను తీసుకొచ్చి సుమ మెడలో వేసేసి ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. ఆ హఠాత్పరిణామానికి సుమ కూడా షాకైపోయింది. తేజస్వి, మెహబూబా ఓ పాట చేశారు. ఇక కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాక అందరిలో మరింత జోష్ వచ్చింది. కింగ్ నాగ్ కూడా అందరితో ఆడి పాడారు... ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్ ’ మూవీ హీరోయిన్ ప్రణవి మానుకొండ ‘సోగ్గాడే చిన్ని నాయన’ లో తన పక్కన బాలనటిగా చేసిందని చెప్పారు. వెంటనే సుమ " ఈ పిల్ల పెద్దగా అయిపోయింది కానీ మనమిద్దరం ఇంకా అలాగే ఉన్నామంటూ" ఫన్నీ కౌంటర్ వేసింది.

తర్వాత వైష్ణవి చైతన్య "మీరంటే చాలా ఇష్టం’ అనేసరికి ఐతే ఒక హగ్ ఇవ్వు అన్నారు. ‘‘బీబీ 7 టీజర్‌లో ‘కుడి ఎడమైతే’ అన్నారు. ఏంటి సార్?’’ అని సుమ అడిగింది. ‘ఓట్లు ఎలా కొట్టాలి, ఏంటి ? అని కంప్లీట్ గేమ్ ప్లే అంతా మైండ్‌లో సెట్ చేసుకుని వస్తున్నారు. ఈసారి అవన్నీ కుదరవ్. చూడు ఒకసారి.. చూసిన తర్వాత మాట్లాడదాం’ అన్నారు కింగ్ నాగ్..."మీ ఊహకు అందనివి ఇంకా ఉన్నాయి" అన్నారు అనిల్ రావిపూడి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.