English | Telugu

 ఆ మ్యూజిక్ ని మిస్ అయ్యాను...నాకు నిఖిల్ దొరికాడు

ఈ వారం "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి... మంచి రేటింగ్ తో నడిచిన ఒకప్పటి సీరియల్ హీరో హీరోయిన్స్ వచ్చారు. ఇక ఆ సీరియల్స్ వాళ్లకు ఎందుకు ఇష్టమో ఈ షోలో వాళ్ళ భావాలను షేర్ చేసుకున్నారు. "గోరింటాకు" సీరియల్ ద్వారా నిఖిల్-కావ్య జోడి తెలుగు ఆడియన్స్ కి బాగా పాపులర్ ఇపోయారు. "ఒక లైఫ్ టర్న్ ఐపోయింది. కన్నడ నుంచి వచ్చిన నన్ను తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చూసేసరికి నాకు బెంగళూరు కి వెళ్లాలని అనిపించేది కాదు. ఇంకా చెప్పాలంటే నాకు ఈ సీరియల్ ద్వారా నిఖిల్ దొరికాడు.

నేను ఆల్రెడీ సగం ఇక్కడ సెటిల్ ఐపోయాను" అని చెప్పింది కావ్య. ఇక తరువాత "కోయిలమ్మ" సీరియల్ నుంచి మానస్ - తేజు మాట్లాడుతూ " మా సీరియల్ లో జనరేషన్ చేంజ్ అయ్యింది. ఐనా కూడా ఆడియన్స్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముందు కంటే కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఇంకా చెప్పాలంటే ఆ సీరియల్ కోసమే కంపోజ్ చేసిన 400 పాటలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రాజెక్ట్ మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది.

మా ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సీరియల్..ఈ ప్రాజెక్ట్ ఐపోయాక నేను మ్యూజిక్ ని చాలా మిస్సయ్యాను" అని చెప్పయింది తేజు. "మౌనరాగం" సీరియల్ లో నటించిన శివ్-ప్రియాంక మాట్లాడారు.."షూటింగ్ కోసం లంగా వోణిలో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎవరో షూటింగ్ కోసం వచ్చారని అనుకున్నారంతా అక్కడి వాళ్ళు.. ఆ తర్వాత మరొకసారి షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ నన్ను గుర్తు పట్టి అమ్ములు..అమ్ములు అని పిలిచేవారు..ఆ మాటలతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆడియన్స్ అభిమానమే నన్ను ఇంతలా నిలబెట్టింది" అని చెప్పింది ప్రియాంక.