Read more!

English | Telugu

రాజ్ కి సాటిమనిషి విలువ తెలియజేసిన కావ్య.. స్వప్న సెలబ్రిటీ అయిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో.. కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నీకు రాజ్ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని కావ్యతో అంటుంది.. ఆయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు సపోర్ట్ గా ఉండరని కావ్య అనగానే.. అప్పుడే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు రాజ్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ చిన్నప్పటి నుండి రాజ్ ని చూస్తున్న నాకు రాజ్ గురించి బాగా తెలుసు. రాజ్ లో మార్పు మొదలు అయిందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ మారిపోయాక రాజ్ చుట్టూ తిరుగుతావని ధాన్యలక్ష్మి అంటుంది. తిరుగుతాను సాటి మనిషికి భార్యకు తేడా ఏంటో తనకి తెలియజేస్తానని కావ్య అనుకుంటుంది.

ఆ తర్వాత కళ్యాణ్, ప్రకాష్ లకి కావ్య భోజనం వడ్డిస్తుంది. ఉపవాసం బ్యాచ్ కి టిఫిన్స్ అయ్యాయా అని ప్రకాష్ అడుగుతాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చేయడానికి కూర్చుంటాడు. కావ్య కావాలనే సాటి మనిషి అనే పదాన్ని పదే పదే మాట్లాడుతుంది. అలా కావ్య ప్రతీసారి సాటిమనిషి అనేసరికి మీరు అలా సాటిమనిషి అనడం బాగోలేదు వదిన అని కళ్యాణ్ అంటాడు. సాటిమనిషి అనే పదం అంత అనకూడనిదా అని  కావ్య అడుగుతుంది. అయితే సాటిమనిషి మీద ఒక కవిత చెప్పండని కావ్య అనగానే కళ్యాణ్ చెప్తాడు. ఇక ఆపండని కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.‌

మరొకవైపు స్వప్న తన గదిలో ఉండగా.. ఇంట్లో అందరు అన్నదానికి తను ఫీల్ అవుతుందేమోనని స్వప్న దగ్గరికి వస్తాడు రాహుల్. కానీ స్వప్న బాధపడుతూ కాకుండా మాములుగా ఉంటుంది. ఏంటి ఇంట్లో వాళ్ళ అన్నదానికి బాధగా లేదా అని రాహుల్ అడుగుతాడు. దేనికి బాధ..  నా గొప్పతనం తెలిసి వాళ్ళే మెచ్చుకుంటారని స్వప్న అంటుంది. మరొకవైపు కావ్య ఏంటి ప్రతీదానికి సాటిమనిషి అని అంటుంది. నేను అమ్మతో మాట్లాడింది విన్నాదా అని రాజ్ అనుకుంటాడు. అపుడే కావ్య వస్తుంది. కావ్యకి కబోడ్ తియ్యడం రాకపోతే రాజ్ హెల్ప్ చేయబోతుంటే సాటి మనిషి సాయం వద్దని కావ్య అంటుంది. ఏంటి మా అమ్మతో అన్న మాట విన్నావా? ఆమాత్రం దానికే ఇలా చేస్తున్నావా అని రాజ్ అనగానే.. ఆ మాట మీకు చిన్నదే కావచ్చు. ఆ మాట విన్న నాకు గుండె పగిలిపోయిందంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి రాజ్ కి వెక్కిళ్లు వస్తుంటే.. కావ్య లేచి వాటర్ ఇస్తుంది. రాజ్ వాటర్ తీసుకోడు. ఒక సాటిమనిషిగా ఇస్తున్నా తీసుకోండని కావ్య అనగానే .. అప్పుడు రాజ్ వాటర్ తీసుకుంటాడు.

మరొకవైపు స్వప్న యాక్ట్ చేసిన ఆడ్ సోషల్ మీడియాలో వస్తుంది. ఆ వీడియోని తీసుకొని స్వప్న దగ్గరికి వస్తాడు రాహుల్. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇప్పుడు మనం సెలబ్రిటీ అయిపోయామని గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.