English | Telugu

శివ్ కి డెంగీ పాజిటివ్..నీతోనే డాన్స్ నుంచి ఈ వారం బ్రేక్


"నీతోనే డాన్స్" నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోకి "బ్రో" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ కూడా వచ్చారు. ఐతే ఈ ఎపిసోడ్ కి శివ్-ప్రియాంక రాలేకపోయారు. ఈ విషయాన్ని హోస్ట్ శ్రీముఖి జడ్జెస్ తో కూడా చెప్పింది. ఐతే వీళ్ళు ఎందుకు రాలేకపోయారు అనే విషయాన్ని ప్రియాంక ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. "శివ్ కి 103 ఫీవర్ ఉండేసరికి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఇక తనకు సెలైన్ కూడా పెట్టారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన హెల్త్ బాగా అప్సెట్ అయ్యింది అని చెప్పింది.

ఇలా మాకే ఎందుకు జరుగుతోంది" అంటూ ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యింది. "డాన్స్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక పెద్ద ఆపర్చునిటీ. నాకు గట్టిగా ప్రాక్టీస్ చేసి షోలో పార్టిసిపేట్ చేయాలనీ ఉంది. దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో అర్ధం కావడం లేదు... చాలా కస్టపడి ప్రాక్టీస్ చేసాను " అని ఎంతో బాధతో చెప్పాడు శివ్.. "సెలైన్ ఐపోయాక ఇంటికి తీసుకెళ్లిపోదాం అనుకున్నా. కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయని..డెంగీ పాజిటివ్ అని చెప్పారు. దాని కారణంగా మేము వచ్చి డాన్స్ చేసే పరిస్థితిలో లేము" అని చెప్పింది ప్రియాంక. "మా పేరెంట్స్ ని రమ్మని చెప్పాను. బయట ఫుడ్ అస్సలు తినకూడదు కాబట్టి..శివ్ కోసం వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. నాకు సీరియల్ షూటింగ్ ఉంది. నేను వచ్చి మద్యమద్యలో చూసుకుంటున్నాను. శివ్ వాళ్ళ మదర్ కి ఫోన్ చేసాను ఐతే ఆమె చాలా కంగారు పడిపోయారు ...వెంటనే బెల్గాం వచేయమన్నారు. కానీ ఈ పరిస్థితిలో తీసుకెళ్ళడమంటే మాటలు కాదు కదా..కాబట్టి వెయిట్ చేయాలి..మా హెల్త్ గురించి మీరంతా ప్రే చేయండి" అని చెప్పింది ప్రియాంక.