English | Telugu

ఈ పెర్ఫార్మెన్స్ కి కాస్ట్లీ బట్టలు అవసరమా అంటూ అఖిల్ మీద ఆది సెటైర్స్

ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం షోలో ఆది మందు బాటిల్ పట్టుకుని చేసిన ఓవర్ యాక్షన్ మాములుగా లేదు. ప్రతీ వారం ఆది ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటాడు. ఈ వారం షో మొత్తం మందు తాగుతూ, చికెన్ పీస్ తింటూ కనిపించాడు. ఈ షోలో అఖిల్ సార్థక్ దీపికా పిల్లికి బావ రోల్ లో వచ్చాడు. అఖిల్ సార్థక్ ని, శేఖర్ మాష్టర్ ని ఒక రేంజ్ మాటలతో ఆడేసుకున్నాడు. అఖిల్ బ్లాక్ కాలర్ థిన్ షర్ట్ తో వచ్చేసరికి "షర్టు, ఫాంటు ఎంత" అని అఖిల్ ని అడిగాడు ఆది. " ఎంతో కొంతలే" అని అఖిల్ రివర్స్ లో కౌంటర్ వేసాడు . "మనమిచ్చే 500 పెర్ఫార్మెన్స్ కి 10 వేల బట్టలు అవసరమా" అని ఆది అనేసరికి అఖిల్ సార్థక్ హార్ట్ అయ్యాడు.

తర్వాత ఈ స్టేజి మీద మందు బాటిల్ పెట్టుకుని తాగుతూ "శేఖర్ ఒక సిప్పేస్తావేంటి" అని అడిగాడు.." సిగ్గులేదా" అని శేఖర్ మాష్టర్ అనేసరికి "అబ్బో అందరూ అడిగేవాళ్ళే అని కౌంటర్ వేసాడు..ఇంతలో పూర్ణ ఆది గారు అని పిలిచేసరికి "ఏరా దుబాయ్ చెప్పు" అన్నాడు. "మీరంతా మంచి వాళ్ళని చెప్పారు" అంది "ఎవరు మంచివాడు..ఎవరు చెప్పారు మీకు నేను మంచివాడినని" అని చెప్పాడు. ఇక బాటిల్ లో మందు తాగుతూ పక్కనే ఉన్న అఖిల్ ని చూస్తూ "ఏరా తాగుతావేంట్రా" అని అడిగాడు..అఖిల్ సైలెంట్ గా దీపికా వైపు చూపించే సరికి "అది బోటిల్ లేపితే దించదు..తెలీదా నీకు" అని అన్నాడు ఆది. ఇక ఈ షోలో రీసెంట్ గా ట్రైన్ యాక్సిడెంట్ మీద ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఈ యాక్సిడెంట్ లో సర్వైవ్ ఐన ఒక తల్లీ - కొడుకు వచ్చి తమ అనుభావాలను ఈ స్టేజి మీద షేర్ చేసుకున్నారు. ఇక ఆది మొదటి నుంచి వాగిన వాగుడికి లాస్ట్ లో అందరూ కలిసి కుమ్మేసారు.