English | Telugu
అందరి ముందు వసుధారపై సీరియస్ అయిన రిషి.. టెన్షన్ పడుతున్న ఏంజిల్!
Updated : Jul 28, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -826 లో... వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి బస్తీలోని పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు శైలేంద్ర పంపిన కాలేజీ బాయ్ దగ్గర డబ్బులు తీసుకొని వసుధారని అవమానిస్తారు. అప్పుడే రిషి పాండియన్ వాళ్లతో వసుధార దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న వాళ్ళకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి గొప్పగా వివరిస్తాడు.
ఆ తర్వాత చదువు అంటే ఏంటి, దానికి సొసైటీలో దానికి ఉన్న విలువ గురించి రిషి అక్కడున్న వాళ్లకి చెప్తాడు. మీలాగే మీ పిల్లలు కావద్దని అనుకుంటే మీరు స్కూల్ కి పంపించండని రిషి చెప్తాడు. కానీ కాలేజీ బాయ్ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం రిషి ఎంత చెప్పిన రిషికి ఎదురు మాట్లాడతారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి చెప్తున్నామని రిషి అంటాడు. కొంతమంది రిషికి సపోర్ట్ చేసి మీరు మా గురించి ఇంత బాగా చెప్తున్నారు తప్పకుండా చదివిస్తామని చెప్తారు. రిషి అక్కడున్న బస్తీ వాళ్లకి తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరుతారు. రిషి వసుధార, ఏంజిల్ కార్ లో వెళ్తుంటారు. ఎందుకు వెళ్ళావని ఏంజెల్ ని తిట్టినట్లు వసుధార ఊహించుకుంటుంది.
ఆ తర్వాత రిషి, వసుధార, కాలేజీ ఫాకల్టీ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటారు. మనం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకున్నామని వాళ్లతో చెప్పామా, మరి ఎందుకు వసుధార మేడం మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడానికి ఒంటరిగా వెళ్లిందని రిషి అందరికి చెప్తూ వసుధారపై కోప్పడతాడు. వసుధార అలా వెళ్లడం తప్పు అన్నట్లు అందరి ముందు వసుధారపై రిషి అరుస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు వసుధారపై రిషి అరవడం చూసి.. అందరు చూసి షాక్ అవుతారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉందని అక్కడున్న కాలేజీ బాయ్ మిగత లెక్చరర్స్ తో అంటాడు. అది విన్న రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లి కాలేజీలో వసుధారపై అరిచింది గుర్తు చేసుకుంటాడు.
ఆ తర్వాత రిషి దగ్గరికి ఏంజిల్ వస్తుంది. కాలేజీలో వసుధారపై కోప్పడ్డావట? తను చేసింది మంచి పనే కదా.. ఎందుకు అలా చేసావ్? వసుధార ఇంకా ఇంటికి రాలేదు.. నాకు టెన్షన్ గా ఉంది. ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యలేదని రిషితో ఏంజిల్ అంటుంది. వసుధారకి రిషి కాల్ చేస్తాడు. వసుధార ఫోన్ లిఫ్ట్ చెయ్యదు కానీ ఫోన్ ఎందుకు చేసారని మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.