English | Telugu
స్వప్న బోల్డ్ యాడ్ తో దుగ్గిరాల ఇంట్లో రచ్చ.. కనకం ఫైర్!
Updated : Jul 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -159 లో... స్వప్న చేసిన యాడ్ ని చూసిన ఇంద్రాణి.. ఇది చాలు ఆ స్వప్నని ఇంటి నుండి బయటకు పంపించడానికి అని రాహుల్ తో అంటుంది. అవును మమ్మీ అని రాహుల్ అంటాడు. ఆ సీతరామయ్య మాటకు ముందు పరువు మాట తర్వాత పరువు అని అంటాడు కదా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని రుద్రాణి అంటుంది.
మరొకవైపు కనకం, కృష్ణమూర్తి ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వెళ్ళడానికి రెడి అవుతారు. మరొకవైపు స్వప్న ఆడ్ చేసిన వీడియో చూసి ఆ వీడియోని కావ్యకి చూపిస్తాడు రాజ్. కావ్య అ వీడియో చూసి షాక్ అవుతుంది. తన భార్య ఇలా రెచ్చిపోతుంటే నీ అక్క మొగుడు ఏం చేస్తున్నాడని రాజ్ అంటాడు. మరొకవైపు స్వప్న ఇంటర్వ్యూ కోసం ప్రెస్ వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారో అపర్ణ, ఇందిరాదేవిలకు అర్థం కాదు. రాహుల్, కళ్యాణ్ మీడియా వాళ్ళని ఆగమని చెప్తారు. కానీ స్వప్న మాత్రమే బాగా రెడీ అయి ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయటకు వస్తుంది. ఏం చేస్తున్నవ్ అక్క అని స్వప్నని కావ్య కోప్పడుతుంది. బయట స్వప్న మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తుంటే.. అసలేం జరుగుతుందని సీతారామయ్య ఇంట్లోకి వెళ్లి కళ్యాణ్ ని అడుగుతాడు.
అప్పుడు స్వప్న ఆడ్ చేసిన వీడియోని టీవీ లో ప్లే చేస్తాడు కళ్యాణ్. ఇంట్లో వాళ్ళు అందరూ స్వప్న బోల్డ్ ఆడ్ ని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత స్వప్నని క్వశ్చన్స్ వేయండని మీడియావాళ్ళకి రాహుల్ సైగ చేస్తాడు. "మీరు ఇలా బోల్డ్ గా ఆడ్ చేస్తే, ఈ దుగ్గిరాల ఇంటి పరువు పోదా" అని ఒక రిపోర్టర్ అడగగా.. అది నా వ్యక్తిగతం అంటూ స్వప్న సమాధానం ఇస్తుంది. ఆప్పుడే అక్కడికి కృష్ణమూర్తి, కనకం వస్తారు. స్వప్నని కావ్య లోపలికి లాక్కొని వెళ్తుంది. రాజ్ మీడియా వాళ్ళని పంపించేస్తాడు. ఆ తర్వాత స్వప్న అంటే వేరే ఇంటి నుండి వచ్చింది. తనకి మన ఇంటి పద్ధతులు తెలియవు. నీకు అయినా తెలుసు కదా.. నువ్వు చెప్పాలి కదా అని రాహుల్ పై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత అందరు స్వప్నపై కోప్పడతారు.
ఆ తర్వాత నువ్వైనా చెప్పాలి కదా రుద్రాణి అని ఇందిరాదేవి అంటుంది. నాకు అసలు ఏ విషయం తెలియదు. ఇలాంటి దాన్ని ఇంట్లో నుండి గేంటేయ్యలని రుద్రాణి అంటుంది. స్వప్న నేనేం తప్పు చెయ్యలేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. అప్పుడే కనకం లోపలికి వచ్చి.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ స్వప్నపై చెయ్యి ఎత్తి కొడుతూ ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.