English | Telugu
సన్మానం నుండి వెళ్ళిపోయినందుకు ఇద్దరి మధ్య ముకుంద చిచ్చు పెట్టనుందా!
Updated : Jul 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -219 లో.. కృష్ణ స్టేజి పైకి వెళ్లి మురారి గురించి గొప్పగా చెప్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి ఏసీపీ సర్ కారణమని చెప్తుంది. ఆ తర్వాత రేవతి గురించి చెప్తుంది. తను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుందని కృష్ణ చెప్పగానే రేవతి సంతోషపడుతుంది.
ఆ తర్వాత ముకుంద మురారి దగ్గరికి వెళ్లి.. చూసావా నువ్వు అంటే కృష్ణకి గౌరవం మాత్రమే.. ప్రేమ లేదు.. మిగతా వాళ్ళలాగే నీ గురించి కూడా అలాగే చెప్తుందని ముకుంద అనగానే.. మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ తన సన్మానం మురారి చేతుల మీదుగా జరగాలని అనుకుంటుంది. ఏసీపీ సర్ ఎక్కడ ఉన్న స్టేజి పైకి రండి అని మురారిని పిలుస్తుంది. అయిన మురారి రాడు ఏసీపీ సర్ లేని సన్మానం నాకు ఎందుకని కృష్ణ ఏడుస్తు స్టేజి కిందకి వస్తుంటే.. భవాని వెళ్లి నచ్చజెప్పుతుంది.
సరే అత్తయ్య.. సన్మానం మీ చేతులు మీదుగా జరిపించండని కృష్ణ అనగానే.. సన్మానం భవాని చేతులమీదుగా జరిపిస్తారు. ఏసీపీ సర్ కి నేను ఇష్టం లేదు.. అందుకే ఇక్కడ లేరు. ఆ డైరీ అమ్మయి ఏసీపీ సర్ మనసులో ఉందని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ ఇంటికి వచ్చాక మురారి రాలేదని బాధపడుతుంది. అలాగే మరొకవైపు మురారి బయట ఉండి కృష్ణ గురించి బాధపడుతాడు. మరొక వైపు ఎందుకు మురారి ఇలా చేసాడని భవాని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత మురారి ఎక్కడ ఉన్నాడో ఫోన్ చెయమని రేవతికి భవాని చెప్తుంది. ఫోన్ కలవటం లేదని రేవతి చెప్తుంది. అప్పుడే మురారి ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళవని మురారిని భవాని అడుగుతుంది. ఎమర్జన్సీ కాల్ వచ్చింది. ఒక అమ్మయి తనని సేవ్ చెయ్యమని ఫోన్ చేసిందని మురారి చెప్తాడు. ఏసీపీ సర్ ఇలా కవర్ చేస్తున్నారా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత నువ్వు అక్కడ లేకపోయేసరికి కృష్ణ చాలా బాధపడిందని భవాని చెప్తుంది. అత్తయ్య వదిలేయండి ఏసీపీ సర్ ఎమర్జెన్సీ కాల్ వస్తేనే వెళ్లారు కదా అని కృష్ణ అంటుంది. కానీ ముకుంద మాత్రం ఏదో ఒక గొడవ చెయ్యాలని అనుకొని.. మీరు బానే ఉంటున్నారు కదా? మీ మధ్య గొడవలేం లేవు కదా? మరెందుకు కృష్ణకి జరిగే సన్మానంలో లేవని భవానికి అనుమానం వచ్చేలా ముకుంద మాట్లాడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.