English | Telugu

తనకు లవర్ లేడని చెప్పిన ఆరోహీ!

ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది.

తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు. ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ' ఆస్క్ మీ క్వశ్చనింగ్ ' స్టార్ట్ చేసింది. " హాయ్ అక్క.. మీ ఊరిలో వర్షం పడుతుందా" అని ఒకరు అడుగగా.. అయిపోయింది కదా బిగ్ బాస్. బాగానే ఉంది.. కొత్త ఎక్స్పీరియన్స్ అని ఆరోహీ అంది. కీర్తిభట్ తో మాట్లాడుతున్నారా? తన ఎంగేజ్ మెంట్ కి వెళ్తున్నారా అని ఒకరు అడుగగా.. మాట్లాడుతున్నాను, నాకు చెప్పకుండా చేసుకుంటదా, అయినా నేను లేకుండా ఎంగేజ్ మెంట్ చేసుకునేంత దమ్ము ఉందా అని ఆరోహి అంది. బిగ్ బాస్ షైనింగ్ ఈవెంట్ కి వెళ్ళారా అక్క అని ఒకరు అడుగగా.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

నేను పోలేదని ఆరోహీ అంది. లైఫ్ బోర్ కొడుతుంది అక్క, ఏం చేద్దాం అంటారని ఒకరు అడుగగా.. ఎవరినైనా పిల్లని ప్రేమించు, రోజుకో కొత్త పంచాయితి, రోజుకో గొడవ.. అప్పుడు లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుందని ఆరోహీ అంది. ఫ్యూచర్ లో నీకు సినిమాల్లో అవకాశం వస్తే ఏ రోల్ చేస్తారు? హీరోయిన్, విలన్ ,కామెడీయిన్ రోల్ చేస్తారా? అని ఒకరు అడుగగా.. నేను ఒక సాడిస్ట్ ని, సైకోని కాబట్టి నాకు హీరోయిన్, కమెడీయిన్ రోల్ నచ్చదు. విలన్ అయితే ఒకే అని ఆరోహీ అంది. నీ లవర్ ని పరిచయం చేయవా అని ఒకరు అడుగగా.. నాకు లవర్ లేదంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా అని ఆరోహీ చెప్పింది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.