English | Telugu

రాజ్ కి సాటిమనిషి విలువ తెలియజేసిన కావ్య.. స్వప్న సెలబ్రిటీ అయిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో.. కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నీకు రాజ్ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని కావ్యతో అంటుంది.. ఆయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు సపోర్ట్ గా ఉండరని కావ్య అనగానే.. అప్పుడే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు రాజ్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ చిన్నప్పటి నుండి రాజ్ ని చూస్తున్న నాకు రాజ్ గురించి బాగా తెలుసు. రాజ్ లో మార్పు మొదలు అయిందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ మారిపోయాక రాజ్ చుట్టూ తిరుగుతావని ధాన్యలక్ష్మి అంటుంది. తిరుగుతాను సాటి మనిషికి భార్యకు తేడా ఏంటో తనకి తెలియజేస్తానని కావ్య అనుకుంటుంది.

నువ్వు కావాలయ్య అంటూ స్టెప్పులేసిన వాసంతి కృష్ణన్, సుదీప!

బిగ్ బాస్ సీజన్-6 లో బ్యూటీ క్వీన్ గా వాసంతి కృష్ణన్ ని పిలుస్తారు‌. తన గ్లామర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాసంతి. హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనుకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి.

ఇంకొన్ని స్టెప్స్ , డాన్స్ ఉంటే బాగుండు అన్న కామెంట్స్ కి సెట్ లో రచ్చరచ్చ...

"నీతోనే డాన్స్" ఈ వారం రెండు రోజులు జరిగిన షోలో రెండు జంటలు కొంచెం అగ్రెసివ్ గా ప్రవర్తించినట్టు అనిపించింది. నటరాజ్ మాష్టర్ - నీతూ రెట్రో రౌండ్ లో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ గెటప్స్ తో వాళ్ళ సాంగ్స్ కి డాన్స్ చేశారు..ఐతే వీళ్లకు అంజలి, పవన్ , కావ్య, నిఖిల్ జంటలు చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. "ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటే బాగుండు అని పవన్ నటరాజ్ మాష్టర్ కి చెప్పేసరికి ఇంకా స్టెప్స్ కావాలా..ఇప్పటికే చాలా స్టెప్స్ వేసాం..ఈ డాన్సస్ ని ఒరిజినల్ క్యారెక్టర్స్ లో ఉన్నవాళ్లు ఉంటే ఎలా చేస్తారో చేసాం" అని చెప్పారు. "అసలు వాళ్ళ సాంగ్స్ లో ఇన్ని మూవ్మెంట్స్ ఉండవు కానీ మేము ఇంకా ఇంప్రొవైజ్ చేసి చూపించాం" అన్నారు.

ఆదిని కిడ్నాప్ చేసిన లేడీస్...పెళ్ళెప్పుడు అని అడిగిన మహిళా రైతులు

బుల్లితెర అంటే చాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదువే ఉండదు. ఎన్నో షోస్ ఉన్నాయి. కానీ వాటిల్లో సూపర్ గా కామెడీతో కలిపి ఎంటర్టైన్ చేసేది జబర్దస్త్ ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో ఆది చేసే కామెడీ పంచెస్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి ఆది మీద లేడీస్ వైపు నుంచి చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి లేడీస్ అంతా కలిసి ఆది మీద తిరగబడ్డారు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో  చాలామంది సీనియర్ యాక్టర్స్ కనిపించారు.  జయవాణి, ప్రీతి నిగమ్, శిల్పా చక్రవర్తి, భావన లాంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో పాటు ప్రస్తుతం చేస్తున్న యాంకర్స్  కూడా ఉన్నారు. వీళ్లందరితో కలిపి చేసిన ఈ షో నెక్స్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. అది కూడా  ‘ఆది కిడ్నాప్’ అనే కాన్సెప్ట్ తో వస్తోంది.