English | Telugu

ఆగస్టు 20న కీర్తి భట్ నిశ్చితార్థం.. ఇన్విటేషన్స్ ఇస్తున్న కీర్తి, విజయ్

కార్తీకదీపం సీరియల్ లో నటించిన కీర్తి భట్ కి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 6లో చక్కగా ఆడి ఫైనల్ వరకు వెళ్ళింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక అమ్మాయిగా నిలిచింది. ప్రస్తుతం ఈమె "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. అలాంటి కీర్తి భట్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. ఆమె హీరో విజయ్ కార్తిక్ ని లవ్ మ్యారేజ్ చేసుకోనుంది. ఐతే విజయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కీర్తి విషయం తెలిసి చాలా హ్యాపీగా ఇద్దరికీ పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. కీర్తి భట్ తన కోడలు కాదని కూతురని విజయ్ వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో చెప్పారు.

జబర్దస్త్ కి తిరిగొచ్చిన చలాకి చంటి..ట్రావెల్ చేసి హ్యాంగోవర్ లో ఉన్నాడన్న కృష్ణభగవాన్

బుల్లితెర మీద ఫేమస్ కమెడియన్ చలాకి చంటి. జబర్దస్త్ లో చంటి స్కిట్స్ కి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. బిగ్ బాస్ 6 హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లారు కూడా. అక్కడ కూడా తనదైన మార్క్ కామెడీతో హౌస్ మేట్స్ ని అలరించాడు.  ఐతే ఈ ఏడాది ఏప్రిల్ లో చంటికి ఛాతినొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా గుండె పోటుగా గుర్తించారు డాక్టర్లు. వెంటనే ఐసీయూకు షిఫ్ట్ చేసి  చికిత్సనందించారు. రక్తనాళాల్లో పూడికలున్నట్టు గుర్తించిన డాక్టర్లు స్టంట్‌ వేశారు. అలా అప్పటి నుంచి నటనకు దూరంగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు చంటి నెమ్మదిగా షోస్ లో మెరుస్తున్నారు..రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చారు.

2020 లో బ్రేకప్..అప్పటినుంచి సింగల్..బ్రో మూవీలో ఆ సీన్ నా లైఫ్ కి దగ్గరగా ఉంటుంది

ఎన్నో రోజులుగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న "బ్రో" మూవీ రిలీజ్ అయ్యింది. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబోలో రిలీజ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ చాలా విషయాలు చెప్పారు. ఈ మూవీలో కేతిక శర్మతో బ్రేకప్ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ఈ సీన్ తన పర్సనల్ లైఫ్ కి బాగా దగ్గరగా ఉంటుందన్నారు. ఇకపోతే ఇప్పుడు "నిఖిల్ తో నాటకాలు" షోలో యూట్యూబర్ నిఖిల్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ ఒక పోడ్ కాస్ట్ చేశారు. అందులో కూడా తన బ్రేకప్ కి సంబంధించి  ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. "2020 లో బ్రేకప్ అయ్యింది. అప్పటినుంచి నేను సింగల్ గానే ఉంటున్నాను.